AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూన్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మంత్రులు, ఎమ్మెల్యే తమ వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకురావొద్దని కార్యదర్శి కోరారు. అసెంబ్లీ జరిగే నాలుగు రోజుల పాటు తగిన జాగ్రత్తలు...

వాళ్లెవరూ అసెంబ్లీకి రావడానికి వీల్లేదు.. ప్రత్యేక గైడ్‌లైన్స్ ఇవే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 14, 2020 | 6:59 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జూన్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా మంత్రులు, ఎమ్మెల్యే తమ వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకురావొద్దని కార్యదర్శి కోరారు. అసెంబ్లీ జరిగే నాలుగు రోజుల పాటు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోవిడ్ నేపథ్యంలో పలు నియంత్రణా చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. భౌతిక దూరం పాటించేందుకు ప్రత్యేక నిబంధనలను జారీ చేశారు. కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ లోపలికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.

అలాగే ఎమ్మెల్యేలు తమ కార్లకు ఖచ్చితంగా పాస్ అతికించాలన్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అసెంబ్లీలోకి విజిటర్లను కూడా అనుమతించటడం లేదన్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల గన్‌మెన్లను అసెంబ్లీలోకి అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఆయుధాలు తీసుకురావద్దని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. సభ్యులంతా మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. అలాగే సభ్యుల పీఎస్‌లు, పీఏలు, పీఎస్‌ఓలను కూడా వెంట తీసుకురావడానికి వీల్లేదని పేర్కొన్నారు ఏపీ అసెంబ్లీ కార్యదర్శి.

Read More: 

బ్రేకింగ్: కరోనాతో ఎమ్మెల్యే గన్‌మెన్‌ మృతి

భారీగా కరోనా మరణాలు.. శవాలతో నిండిపోయిన అతిపెద్ద శ్మశాన వాటిక

దారుణం.. ఇంటర్ ఫెయిల్‌తో.. ముగ్గురు విద్యార్థినుల ఆత్మహత్య!

తెలంగాణ సచివాలయంలో మరో కరోనా కేసు.. ఉలిక్కిపడుతోన్న ఉద్యోగులు

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే