మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కరోనా వైరస్ కారణంగా మున్ముందు ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా సిటీ బస్సులు, మెట్రో సర్వీసులలో భౌతిక దూరం తప్పనిసరి కానుండటంతో రద్దీ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా మెట్రో రూ. 100 కోట్లు, ఆర్టీసీ రూ. 120 కోట్ల మేరకు నష్టాలు చవిచూశాయి. కరోనా […]

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!
Follow us

|

Updated on: May 08, 2020 | 8:02 AM

కరోనా వైరస్ కారణంగా మున్ముందు ప్రజా రవాణా వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా సిటీ బస్సులు, మెట్రో సర్వీసులలో భౌతిక దూరం తప్పనిసరి కానుండటంతో రద్దీ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా మెట్రో రూ. 100 కోట్లు, ఆర్టీసీ రూ. 120 కోట్ల మేరకు నష్టాలు చవిచూశాయి.

కరోనా నేపధ్యంలో ఇకపై మెట్రో రైళ్లలో ప్రయాణీకులు నిలుచునేందుకు వైట్ మార్కింగ్ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని మెట్రో అధికారులు అనుకుంటున్నారు. గతంలో ఒక్కో రైలులో 900 మంది ప్రయాణీకులు ప్రయాణించగా.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంతమందిని అనుమతించే అవకాశం ఉండదు. దీనితో 50 శాతం ఆక్యుపెన్సీతోనే సర్వీసులను పునరుద్ధరణ చేయాలని భావిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే ప్రతీ ప్రయాణీకుడికి శానిటైజర్లను అందజేయడం, భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ ఉంటేనే అనుమతించడం వంటి రూల్స్‌ను ఖచ్చితంగా అమలు చేయనున్నారు.

మరోవైపు ఆర్టీసీ కూడా ఇదేవిధంగా ప్రణాళికలను సిద్దం చేస్తోంది. గ్రేటర్‌లో తిరిగే బస్సులకు రెండువైపులా డోర్లను ఏర్పాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఇకపై స్టాండింగ్ జర్నీని అనుమతించరాదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతీ రోజూ బస్సులను శానిటైజ్ చేసి.. ప్రయాణీకులు భౌతిక దూరాన్ని పాటించే విధంగా మార్కింగ్ చేయనున్నారు. అంతేకాకుండా ముగ్గురు కూర్చునే సీట్లలో ఇద్దరినీ, ఇద్దరు కూర్చునే సీట్లలో ఒకరిని అనుమతించనున్నారు. ఏసీ, నాన్‌ ఏసీ లోఫ్లోర్‌ బస్సుల్లో ఆటోమేటిక్‌ డోర్లు ఏర్పాటు చేస్తారు. అటు బస్సుల్లో టికెట్లు ఇచ్చే పద్దతికి బదులుగా గ్రౌండ్ టిక్కెటింగ్ విధానాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. మరి ఇందులో ఎంతమేరకు సాధ్యమవుతుందో చూడాల్సి ఉంది.

Read This: కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!