Breaking: తెలంగాణలో మాస్క్ లేకుండా బయటకొస్తే రూ.1000 ఫైన్..
తెలంగాణలో లాక్ డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 64ను విడుదల చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి… జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలు రద్దు. ప్రత్యేక శ్రామిక్ రైలు మినహా మిగతా రైలు సర్వీసులు రాష్ట్రంలో రద్దు. అంతర్ రాష్ట్ర, జిల్లాల ప్రయాణాలు నిషేధం మెట్రో సర్వీసులు రద్దు. అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు, కోచింగ్, ట్రైనింగ్ సెంటర్లు బంద్ ప్రజలు […]

తెలంగాణలో లాక్ డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 64ను విడుదల చేసింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఆదేశాలు జారీ చేసింది.
మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి…
- జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలు రద్దు.
- ప్రత్యేక శ్రామిక్ రైలు మినహా మిగతా రైలు సర్వీసులు రాష్ట్రంలో రద్దు.
- అంతర్ రాష్ట్ర, జిల్లాల ప్రయాణాలు నిషేధం
- మెట్రో సర్వీసులు రద్దు.
- అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు, కోచింగ్, ట్రైనింగ్ సెంటర్లు బంద్
- ప్రజలు ఎక్కువగా గుమిగూడే రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం
- సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ.
- కరోనా వైరస్ కట్టడిలో భాగంగా మాస్కులు ప్రతీ ఒక్కరూ ధరించడం తప్పనిసరి. ఒకవేళ రూల్స్ అతిక్రమించి మాస్క్ లేకుండా బయట తిరిగితే ₹1000 ఫైన్.
- ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ఈ కామర్స్ సంస్థలకు అనుమతి
- రెడ్ జోన్లలో కేవలం అత్యవసర వస్తువులకు మాత్రమే హోం డెలివరీ
- అన్ని ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ ఆఫీసులు కేవలం 33 శాతం ఉద్యోగుల తోనే పని చేయాలి… మిగతా వారికి వర్క్ ఫ్రొం హోమ్.
- గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పూర్తి శాతం ఉద్యోగాలతో పని చేసుకోవచ్చు
Read More:
కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!
భారత్ కుట్రపూరిత చర్యలపై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నాః ఇమ్రాన్ ఖాన్
Coronavirus Death Tollcoronavirus in telanganaCoronavirus outbreakLatest Telangana NewsTelangana News Updates