Alert : కరోనా కోసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్ల ప్రకటన..!

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల మందికి పైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. లక్షన్నర మందికి పైగా ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్‌ వణికిస్తోంది. అయితే ప్రజల్లో భయాల్ని పోగొట్టడమే కాకుండా.. సహాయక చర్యలకోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అయితే గతంలో విడుదల చేసిన కరోనా హెల్ప్‌లైన్ నంబర్లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉన్న […]

Alert : కరోనా కోసం కొత్త హెల్ప్‌లైన్ నంబర్ల ప్రకటన..!
Follow us

| Edited By:

Updated on: Mar 16, 2020 | 7:29 PM

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల మందికి పైగా దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. లక్షన్నర మందికి పైగా ఈ వైరస్ సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. తాజాగా మనదేశాన్ని కూడా ఈ వైరస్‌ వణికిస్తోంది. అయితే ప్రజల్లో భయాల్ని పోగొట్టడమే కాకుండా.. సహాయక చర్యలకోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. అయితే గతంలో విడుదల చేసిన కరోనా హెల్ప్‌లైన్ నంబర్లను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉన్న నంబర్ల స్థానంలో కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది. కరోనా వైరస్ గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా.. 1075 నంబరుకు కాల్ చేసి తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంతేకాదు..1800-112-545 నంబరుకు ఫోన్ చేసినా కూడా కరోనావైరస్ గురించి కావాల్సిన సమాచారం అందజేస్తామని వెల్లడించింది. దేశం నుంచి ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిచెందకుండా అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. కేవలం ఈ నంబర్లే కాకుండా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఆ నంబర్లకు ఫోన్ చేసినా కూడా.. కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.