ఆయన నాకు పితృ సమానులు.. ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా
SP బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ రికార్డింగ్ స్టూడియోలో సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు పట్నాయక్, ఖుద్ధూస్, మ్యూజిక్ కంపోజర్ లినస్, గాయని విజయలక్ష్మి..

SP బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ రికార్డింగ్ స్టూడియోలో సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు పట్నాయక్, ఖుద్ధూస్, మ్యూజిక్ కంపోజర్ లినస్, గాయని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. బాలు గారు నాకు పితృ సమానులు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలు గారి అభిమానులు అందరూ 6 గంటలకు ప్రార్థనలు చేశారు. ఆయన త్వరగా కోలుకుని మునుపటివలే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము.
సింగర్ విజయలక్ష్మి మాట్లాడుతూ: బాలు గారంటే మా ప్రాణం. ఆయన ప్రొఫెషనల్ గానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మా బాగోగులు తెలుసుకుంటారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. తెలుగు మ్యూజీషియన్స్ పిలుపు మేరకు బాలు గారి అభిమానులందరూ ఆయన కోసం ప్రార్థనలు చేశారు.
Also Read:
శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా: బన్నీ
రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు



