రుణ గ్రహీతలకు వడ్డీ మాఫీ : కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

కోవిడ్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక వత్తిళ్ళ నుంచి రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో ప్రకటించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ మేరకు ఆగస్టు 6న బ్యాంక్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రుణ అర్హత కలిగిన వ్యక్తులు, కార్పొరేట్లు, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు చెందిన మొండి బకాయిలు, రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు వ్యక్తిగతమైన […]

రుణ గ్రహీతలకు వడ్డీ మాఫీ : కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌
Follow us

|

Updated on: Sep 20, 2020 | 5:37 PM

కోవిడ్‌ కారణంగా ఏర్పడిన ఆర్థిక వత్తిళ్ళ నుంచి రుణ గ్రహీతలకు ఉపశమనం కల్పించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చర్యలు చేపట్టినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రాజ్యసభలో ప్రకటించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ మేరకు ఆగస్టు 6న బ్యాంక్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రుణ అర్హత కలిగిన వ్యక్తులు, కార్పొరేట్లు, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు చెందిన మొండి బకాయిలు, రుణాలను పునర్వ్యవస్థీకరించేందుకు వ్యక్తిగతమైన పరిష్కార ప్రణాళికలను రూపొందించవలసిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రుణ గ్రహీతలకు వివిధ రూపాలలో ఊరట కల్పించడం జరిగిందని చెప్పారు. వడ్డీ రేట్ల మార్పు, వడ్డీ రూపంలో రావలసిన మొత్తాలను మాఫీ చేయడం, జరిమానా వడ్డీ మాఫీ వంటి చర్యలు రుణగ్రహీతలకు ఊరటనిస్తాయని మంత్రి తెలిపారు. ద్రవ్యోల్బణం కారణంగా బ్యాంక్‌లలో డిపాజిట్ల పెరుగుదల రేటు పడిపోలేదని మరో ప్రశ్నకు జవాబుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి వెల్లడించారు. వాస్తవానికి ద్రవ్యోల్బణంలో స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జూన్‌ నాటికి బ్యాంక్‌లలో డిపాజిట్లు 9.5 శాతం నుంచి 11.5 శాతానికి పెరిగినట్లు స్పష్టం చేశారు.

120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు
మా వడ్డీ ఎప్పుడు జమ చేస్తారు..? ఈపీఎఫ్ఓను ఏకేసిన సబ్‌స్క్రైబర్లు