AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ : కేంద్రం

క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో ఆదివారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు. అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన […]

మార్చి నాటికి కోవిడ్ వ్యాక్సిన్ : కేంద్రం
Venkata Narayana
|

Updated on: Sep 20, 2020 | 5:06 PM

Share

క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయితే వచ్చే ఏడాది మార్చి నాటికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విన్‌ కుమార్‌ చౌబే వెల్లడించారు. రాజ్యసభలో ఆదివారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీ కోసం దేశంలో ఆరు సంస్థలకు సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఐ) అనుమతించినట్లు మంత్రి చెప్పారు. అనుమతి పొందిన తయారీదారులలో పూనేకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, జెనోవా బయోఫార్మాస్యూటికల్స్‌, అహ్మదాబాద్‌కు చెందిన కాడిలా హెల్త్‌కేర్‌, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌ ఈ, అరబిందో ఫార్మా, ముంబైకి చెందిన రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఉన్నట్లు తెలిపారు. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మరో 30 వరకు వ్యాక్సిన్‌ పరిశోధనలకు సాయపడుతున్నట్లు చెప్పారు. కోవిడ్‌ 19 టెస్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఒకటని మంత్రి వెల్లడించారు. అలాగే కోవిడ్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌, హెల్త్‌ సిస్టమ్‌ ప్యాకేజి కింద రెండు దశలలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..