మసీదులో మహిళ.. ఎవరామె.? ఏమిటా కథ..

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎలాంటి మతపరమైన ప్రార్ధనలకు అనుమతి లేకుండా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లను మూసివేసింది. అయితే కొంతమంది మాత్రం లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి మసీదులో ప్రార్ధనలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక మసీదులో 11 మంది గుంపుగా చేరి సామూహిక ప్రార్ధనలు చేస్తున్నారని సమాచారం అందటంతో తహశీల్దార్ శోభిత అక్కడికి […]

మసీదులో మహిళ.. ఎవరామె.? ఏమిటా కథ..
Follow us

|

Updated on: May 02, 2020 | 6:32 PM

కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఎలాంటి మతపరమైన ప్రార్ధనలకు అనుమతి లేకుండా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లను మూసివేసింది. అయితే కొంతమంది మాత్రం లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించి మసీదులో ప్రార్ధనలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలోని కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానిక మసీదులో 11 మంది గుంపుగా చేరి సామూహిక ప్రార్ధనలు చేస్తున్నారని సమాచారం అందటంతో తహశీల్దార్ శోభిత అక్కడికి చేరుకొని ప్రార్ధనను అడ్డుకున్నారు. మసీదు గేట్లకు తాళాలు వేసి.. నిబంధనలకు విరుద్దంగా మసీదులో ప్రార్ధనలు చేస్తున్న వారిపై లాక్ డౌన్ నిబంధన, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. కాగా, రంజాన్ మాసంలో తొలి శుక్రవారం కావడం వల్ల మసీదుల్లోకి వెళ్లి ప్రత్యేక ప్రార్ధనలు చేశారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కొంతమంది మత పెద్దలు మాత్రం ఓ మహిళ మసీదులోకి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే శోభిత మాత్రం తాను మహిళగా మసీదులోకి వెళ్లలేదని.. అధికారిణిగా అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి వెళ్లాలని తెలిపారు. తాను ఏ మతాన్ని కూడా కించపరచలేదని స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తహశీల్దార్ శోభిత, కోలార్ ఎస్పీలను నివేదిక ఇవ్వాలని సూచించింది.

Read More:

కొంపముంచిన వన్ బై టూ ఛాయ్… గుంటూరులో ఏకంగా 100 మందికి..

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.!

లాక్‌డౌన్‌ 3.0.. జోన్లు వారీగా నిబంధనలు ఇవే..

గబ్బిలాలపై విస్తృత పరిశోధనలు.. షాకింగ్ నిజాలు.!

ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ కార్డుదారులకు 30 కిలోల ఉచిత బియ్యం..

షాకింగ్: సీఎం సెక్యూరిటీలో ముగ్గురికి కరోనా పాజిటివ్…