గుడ్‌న్యూస్.. కరోనా ముక్త్ రాష్ట్రంగా అవతరించిన తొలి రాష్ట్రం ఇదే..
ప్రపంచాన్ని పట్టీపీడిస్తున్న భూతం కరోనా. ఇది ఇప్పుటికే 23లక్షలమందిని సోకగా.. దాదాపు లక్షన్నర మందిని మింగేసింది. ఇది మనదేశంలో కూడా విజృంభిస్తోంది. అయితే అనేక రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. మణిపూర్ రాష్ట్రం మాత్రం తొలి కరోనా ముక్త్ రాష్ట్రంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని ఆ రాష్ట్ర సీఎం ఎన్ బిరెన్ సింగ్.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదివారం ఉదయం రాష్ట్రంలో కరోనా గురించి […]

ప్రపంచాన్ని పట్టీపీడిస్తున్న భూతం కరోనా. ఇది ఇప్పుటికే 23లక్షలమందిని సోకగా.. దాదాపు లక్షన్నర మందిని మింగేసింది. ఇది మనదేశంలో కూడా విజృంభిస్తోంది. అయితే అనేక రాష్ట్రాల్లో ఇంకా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. మణిపూర్ రాష్ట్రం మాత్రం తొలి కరోనా ముక్త్ రాష్ట్రంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా లేదని ఆ రాష్ట్ర సీఎం ఎన్ బిరెన్ సింగ్.. తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆదివారం ఉదయం రాష్ట్రంలో కరోనా గురించి తాజా అప్డేట్స్‌ను పోస్ట్ చేశారు. ఆదివారం వెల్లడించారు.
కరోనా మహమ్మారి లక్షణాలతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రెండో వ్యక్తికి కూడా మరోసారి పరీక్షలు నిర్వహించామని.. ఈ రిపోర్టుల్లో బాధితుడికి నెగిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశాలకు హాజరైన 65 ఏళ్ల ఓ వ్యక్తికి కరోనా వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అతడిని స్థానిక ఇంఫాల్‌లోని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అతడికి మళ్లీ కరోనా పరీక్షలు చేయగా.. రిపోర్టుల్లో నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ఇప్పటి వరకు మణిపూర్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు రెండు నమోదయ్యాయని.. ఆ రెండు ఇప్పుడు నెగిటివ్‌గా మారడంతో.. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కటి కూడా లేవని సీఎం స్పష్టం చేశారు.
కాగా.. రాష్ట్రంలో తొలి కేసు యూకే నుంచి వచ్చిన ఓ యువతికి వచ్చిందని.. రెండో కేసు మర్కజ్‌కు వెళ్లిన తబ్లీఘీ సభ్యుడికి వచ్చిందని.. ప్రస్తుతం ఇద్దరికీ నెగిటివ్ వచ్చిందన్నారు. అయితే మరోసారి పరీక్షలు చేసి.. అప్పుడు కూడా నెగిటివ్ వస్తే తబ్లీఘీ సభ్యుడిని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో కరోనాలేని తొలి రాష్ట్రంగా మణిపూర్ రికార్డ్ సృష్టించింది.
Good news : the second #COVID19 patient who is undergoing treatment at RIMS, Imphal has reported negative of Novel Corona Virus disease. Now Manipur has zero positive case of COVID-19 as on date as the two cases of Manipur have been reported negative. pic.twitter.com/JrOZgvzS3w
— N.Biren Singh (@NBirenSingh) April 19, 2020