చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారు చేశారంటూ నోబెల్ అవార్డు గ్రహీత లూక్ మోంటాగ్నియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లూక్ కరోనా గురించి పలు విషయాలను పంచుకున్నాడు. అడవి జంతువుల నుంచి చైనాలోని వుహన్ తడి మార్కెట్‌కు కరోనా వ్యాప్తి చెందిందనడంలో ఏ మాత్రం నిజం లేదని.. అది అసాధ్యమని ఆయన అన్నారు. 2000 సంవత్సరం నుంచి వుహన్‌లోని ప్రయోగశాలలు కరోనా వైరస్‌లను తయారు […]

  • Ravi Kiran
  • Publish Date - 4:00 pm, Sun, 19 April 20
చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను చైనాలోని ఓ ల్యాబ్‌లో తయారు చేశారంటూ నోబెల్ అవార్డు గ్రహీత లూక్ మోంటాగ్నియర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సీఎన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లూక్ కరోనా గురించి పలు విషయాలను పంచుకున్నాడు. అడవి జంతువుల నుంచి చైనాలోని వుహన్ తడి మార్కెట్‌కు కరోనా వ్యాప్తి చెందిందనడంలో ఏ మాత్రం నిజం లేదని.. అది అసాధ్యమని ఆయన అన్నారు. 2000 సంవత్సరం నుంచి వుహన్‌లోని ప్రయోగశాలలు కరోనా వైరస్‌లను తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ల్యాబ్ నుంచి వైరస్ బయటికి వచ్చిందని మోంటాగ్నియర్ వెల్లడించారు.

వుహన్ నేషనల్ బయోసేఫ్టీ ల్యాబొరేటరీలో ఎయిడ్స్ వైరస్ కోసం వ్యాక్సిన్ తయారు చేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టుకొచ్చిందని ఆయన అన్నారు. కరోనా వైరస్ జన్యువుల్లో ఎయిడ్స్ మూలాలు, మలేరియా జెర్మ్స్ ఉన్నట్లు మోంటాగ్నియర్ వివరించారు. అందుకే ఈ వైరస్ సహజంగా పుట్టినట్లు తనకు అనిపించట్లేదన్నారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణం అని తెలిస్తే పరిస్థితులు ఎలా మారతాయో చెప్పలేమంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తరుణంలో మొంటాగ్నియర్ చేసిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..