AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washim Corona Updates: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. ఒకే పాఠశాలలో 229 మంది విద్యార్థులకు సోకిన కోవిడ్..

మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. తాజాగా రాష్ట్రంలోని వాషిమ్ జిల్లాలోని ఓ ట్రైబల్ వెల్ ఫేర్ పాఠశాలలో 229 మంది విద్యార్థులకు కరోనా సోకింది.

Washim Corona Updates: మహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా.. ఒకే పాఠశాలలో 229 మంది విద్యార్థులకు సోకిన కోవిడ్..
Rajitha Chanti
|

Updated on: Feb 25, 2021 | 10:54 AM

Share

Washim Corona Updates: మహారాష్ట్రలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. తాజాగా రాష్ట్రంలోని వాషిమ్ జిల్లాలోని ఓ ట్రైబల్ వెల్ ఫేర్ పాఠశాలలో 229 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతోపాటు లాతూరులోని ఓ పాఠశాలలో నిన్న ఒక్కరోజే 45 మంది గిరిజన విద్యార్థులు ఈ మహామ్మారి భారిన పడ్డారు. జిల్లాలోని ట్రైబల్ వెల్ ఫేర్ పాఠశాలలో మొత్తం 327 మంది విద్యార్థులుండగా.. 229 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. విద్యార్థులతోపాటు నలుగురు ఉద్యోగులు కూడా కరోనా సోకింది. ఇందులో ఎక్కువమంది 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్నరే. కరోనా భారీన పడ్డా విద్యార్థులలో ఎక్కువ మంది ధరణి, అచల్ పూర్, మెల్ఘాట్ బెల్ట్‏లకు చెందినవారే.

లాక్ డౌన్ అనంతరం ఇటీవలే పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ఫిబ్రవరి 14న విద్యార్థులంతా పాఠశాలకు రావడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే విద్యార్థులంతా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. కొరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నట్లు గుర్తించిన కొంతమంది విద్యార్థులకు కొద్దిగా జలుబు వచ్చింది. మిగతా విద్యార్థులకు ఎలాంటి లక్షణాలు లేదా అసౌకర్యం కలగలేదు. అలాగే విద్యార్థులందరి ఆరోగ్యాన్ని తనిఖీ చేయడానికి 24 గంటల ఆరోగ్య బృందాలను నియమించారు.

కోరోనరీ హార్ట్ డిసీజ్ విద్యార్థులకు సరైన చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ రోజుకు 24 గంటలు రెసిడెన్షియల్ పాఠశాలలో ఇద్దరు వైద్యులతో సహా రెండు ఆరోగ్య బృందాలను నియమించింది. ఈ బృందం విద్యార్థుల బాడీ టెంపరేచర్, ఆక్సిజన్ స్థాయిని క్రమమైన వ్యవధిలో ఉండేలా చెక్ చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా విద్యార్థులకు ఇతర లక్షణాలు ఉంటే వెంటనే చికిత్స చేయించాల్సి ఉంటుంది. పాఠశాల యాజమాన్యం 24 గంటలు ఉండేలా సిబ్బందిని నియమించింది. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఆరోగ్య బృందం దృష్టికి తీసుకురావాలి. విద్యార్థులందరికి సకాలంలో సరైన పోషకాహారం అందేలా చూసుకోవాలి.

Also Read: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా.. గడిచిన 24 గంటల్లో 6,18,399 కేసులు, 10,178 మరణాలు..

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్