AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో మళ్లీ విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

భారతదేశంలో కూడా పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి.

మహారాష్ట్రలో మళ్లీ విజ‌ృంభిస్తున్న కరోనా మహమ్మారి.. కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
Balaraju Goud
|

Updated on: Mar 16, 2021 | 9:07 PM

Share

Maharashtra new COVID-19 guidelines : కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే ఆందోళనకర స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని… అది ప్రస్తుతం ప్రారంభ దశలో ఉందని పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

భారతదేశంలో కూడా పలు రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. పరిస్థితులు అదుపులోకి రాకపోతే..మరిన్ని కఠినంగా ఆంక్షలు విధించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ప్రధానంగా..మహారాష్ట్రలో అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితి అదుపులోకి రాకపోతే..ముంబైలో మరోసారి లాక్ డౌన్ విధించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. అయితే..ఈసారి పాక్షికంగా విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

దీంతో అలర్ట్ అయిన మహరాష్ట్ర సర్కార్ మరోసారి కోవిడ్ నిబంధనలకు సిద్ధమైంది. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం సినిమా హాల్స్, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఆంక్షలు అమలు చేయక తప్పడం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను మార్చి 21, 2021 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. మాస్కులు, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల ఏర్పాటు తప్పనిసరి అని పేర్కొంది.

వైద్య, ఆరోగ్య సంస్థలు, ఇతర నిత్యావసర సేవలకు సంబంధించిన వ్యాపార సంస్థలు 50 శాతం సామర్థ్యంతో పనిచేయాల్సి ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర జనసమర్థత కలిగిన కార్యాలయాల ప్రాంగణంలోకి ప్రవేశించేటప్పుడు సరైన ముసుగులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంటే పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రజలు సామాజిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. ఏదైనా సందర్భంలో ఉల్లంఘన దొరికితే సంబంధిత హోటళ్లు, సినిమా, రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేస్తామని కుంటే హెచ్చరించారు.

ఇక, వివాహానికి 50 మందికి మించరాదని, అంత్యక్రియలకు 20 మంది వరకు మాత్రమే అనుమతి ఉంటుందని మార్గదర్శకాలు పేర్కొన్నారు. కోవిడ్ రోగుల ఇంట్లో ఒంటరిగా ఉండాలని, 14 రోజులు వారి తలుపు మీద ఒక బోర్డు ఉంచాలని అధికారులు వెల్లడించారు. కోవిడ్ పాజిటివ్ రోగిపై ఇంటి దిగ్బంధం స్టాంప్ వేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

Read Also… ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్లు..!