మరో మంత్రికి కరోనా పాజిటివ్..మంత్రివర్గంలో ఆందోళన
కోవిడ్-19 వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది.

కోవిడ్-19 వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలో వైరస్ విలయతాండవం చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల్లో దేశంలోనే మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, తాజాగా మరో మంత్రికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. న్యాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు వైరస్ సోకింది. ఆయన వ్యక్తిగత సహాయకుడితో పాటు కొంతమంది ఉద్యోగులకు నిర్దారణ కావడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. బుధవారం మంత్రాలయలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముండే పాల్గొన్నారు. దీంతో మంత్రివర్గంతో పాటు ఉన్నతాధికారుల్లో ఆందోళన మొదలైంది.
కరోనా బారిన పడ్డ మూడో మంత్రి ధనుంజయ్ ముండే కాగా, అంతకుముందు గృహనిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్, పబ్లిక్ వర్క్స్ మంత్రి అశోక్ చవాన్‌కు కూడా కరోనా సోకింది. అయితే వీరిద్దరూ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మహారాష్ట్రలో ఇప్పటి వరకు 97,648 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,590 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే నిన్న 97 మంది కరోనాతో చనిపోయారు.




