షాక్: ఐఏఎస్ ఆఫీసర్ మూర్ఖత్వంతో.. ఏకంగా 36 మందికి కరోనా..

పిచ్చో.. లేక మూర్ఖత్వమో తెలియదు గానీ.. ఓ ఐఏఎస్ ఆఫీసర్ వల్ల ఏకంగా 36 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పల్లవి జైన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వంలో కీలకశాఖలో పని చేస్తోంది. ఆమె ఇటీవల విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడి విషయాన్ని దాచి పెట్టింది. ఇక అతడి వల్ల ఆమెకు కరోనా సోకగా.. లక్షణాలు బయటపడేలోపు మిగిలిన అధికారులతో సమీక్షలు జరపింది. దీనితో ఆ ఐఏఎస్ ఆఫీసర్‌కు, […]

షాక్: ఐఏఎస్ ఆఫీసర్ మూర్ఖత్వంతో.. ఏకంగా 36 మందికి కరోనా..
Follow us

|

Updated on: Apr 12, 2020 | 12:20 PM

పిచ్చో.. లేక మూర్ఖత్వమో తెలియదు గానీ.. ఓ ఐఏఎస్ ఆఫీసర్ వల్ల ఏకంగా 36 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పల్లవి జైన్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వంలో కీలకశాఖలో పని చేస్తోంది. ఆమె ఇటీవల విదేశాల నుంచి వచ్చిన తన కుమారుడి విషయాన్ని దాచి పెట్టింది.

ఇక అతడి వల్ల ఆమెకు కరోనా సోకగా.. లక్షణాలు బయటపడేలోపు మిగిలిన అధికారులతో సమీక్షలు జరపింది. దీనితో ఆ ఐఏఎస్ ఆఫీసర్‌కు, మిగిలిన వాళ్లకు టెస్టులు చేయగా మొత్తంగా 36 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఇంత చేసిన తర్వాత కూడా ఆమె ఆసుపత్రికి రానని మొండికేస్తే.. డాక్టర్లు స్వయంగా ఆమె ఇంటికి వచ్చి ఉదయం, సాయంత్రం చికిత్స అందిస్తున్నారు. దీనితో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమెపై సీరియస్ అయినా.. ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

ఇది చదవండి: లాక్ డౌన్ బేఖాతర్.. మసీద్‌లో వందమంది ప్రార్ధనలు.. షాకైన పోలీసులు..