కూతురి ప్రేమ వివాహం..ఆపేందుకు క‌రోనా నాట‌కం…

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణంలో విషాదాల‌తో పాటు ..ఎన్నో చిత్ర విచిత్రాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ విచిత్ర‌ సంఘ‌ట‌న చోటు చేసుకుంది...

కూతురి ప్రేమ వివాహం..ఆపేందుకు క‌రోనా నాట‌కం...
Follow us

|

Updated on: Jul 28, 2020 | 8:13 PM

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న త‌రుణంలో విషాదాల‌తో పాటు ..ఎన్నో చిత్ర విచిత్రాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ విచిత్ర‌ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ త‌ల్లిదండ్రులు త‌మ కూతురికి క‌రోనా ఉందంటూ కోర్టును ఆశ్ర‌యించారు.

కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం నచ్చని తల్లిదండ్రులు ఆమెకు కరోనా ఉందంటూ కోర్టుకు వెళ్లారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. పెద్దలు అంగీకరించకపోవడంతో 22ఏళ్ల యువతి తన ప్రియుడిని రిజిస్టర్ మ్యారేజి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అన్నీ సిద్ధం చేసుకుని ప్రేమికులిద్దరూ తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకునే సమయానికి ఆమె తల్లిదండ్రులు అక్క‌డ‌కు చేరుకున్నారు. తమ కుమార్తెకు కరోనా ఉందని చెప్పారు. దీంతో కోర్టు ఆ యువతిని ఆసుపత్రికి, యువకుడిని క్వారంటైన్ కు పంపాలని ఆదేశించడానికి రెడీ అయ్యింది. అయితే ఆ సమయంలో పోలీసులు ఆ అమ్మాయికి కరోనా లక్షణాలు లేవనీ, కేవలం వివాహం ఆపడానికే ఆమె తల్లిదండ్రులు కరోనా అంటున్నారని తెలియ జేయడంతో వారి పెళ్లి జరిగింది.

Latest Articles