చూశారా..! సమంత పంట పడింది…
ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. దీనికోసం ఏమేం కావాలో చెప్పింది. మిద్దె పంటలతో కూరగాయలను ఎలా పండించాలో చేసి చూపించింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి...
కరోనా తెచ్చిన అనుకోని సెలవులను అంతే చక్కగా వాడుకుంది అక్కినేని కోడలు. అంతే కాదు ఎలా వాడుకోవాలో కూడా తన ఫ్యాన్స్ కు చేసి చూపించింది. లాక్‌డౌన్‌ను తనకు కావాల్సినట్లు డిజైన్ చేసుకుంది. తన భర్త నాగ చైతన్యతో కలిసి ఎంజాయ్ చేసింది సమంత.
లాక్ డౌన్ సమయంలో ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. దీనికోసం ఏమేం కావాలో చెప్పింది. మిద్దె పంటలతో కూరగాయలను ఎలా పండించాలో చేసి చూపించింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి తన టెర్రరస్ పంటలను ఫ్యాన్స్ కు చూపించింది. మరోసారి లాక్ డౌన్ వంటి సమస్యలు వస్తే ఎలా మన ఇంట్లో ఉన్న స్థలాన్ని ఎలా వినియోగించుకోవచ్చే వివరించింది.
తాను ఫ్యాన్సుతో ఎప్పుడు మాట్లాడినా ఒకే ప్రశ్న వస్తుంటుంది.. మీ హ్యాబీ ఏంటి..? మీ ఆరోగ్య రహస్యం చెప్పండి..? అంటూ ఒకే ప్రశ్నను వేస్తుంటారు. వారికి అర్థమయ్యేందుకే లాక్ డౌన్ సమయంలో గార్డెనింగ్ పెంపకం చూపించానని అన్నారు. గ్రో హెల్తీ.. ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలని సూచించారు.