తమిళనాడులో కరోనా విలయ తాండవం.. తాజాగా మరో 6,972 కేసులు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు..
తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా నిలుస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 6,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,27,688కి చేరింది. ఇక వీటిలో కరోనా నుంచి కోలుకుని 1,66,956 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 57,073 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారినపడి 3,659 మంది మరణించారు.
కాగా, దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అరలక్షకు చేరువగా నమోదవుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు తిరిగి లాక్‌డౌన్ విధిస్తున్నాయి.
Chennai: 6,972 new #COVID19 cases and 88 deaths reported in Tamil Nadu today.
Total number of cases stand at 2,27,688 including 57,073 active cases, 1,66,956 discharges and 3,659 deaths: Tamil Nadu State Health Department #TamilNadu pic.twitter.com/UDtymzzfBL
— ANI (@ANI) July 28, 2020