AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా అల‌ర్ట్ః వైర‌స్ పరీక్షల్లో మరో రెండు లక్షణాలు

క‌రోనా టెస్టుల కోసం ప్ర‌స్తుతం ప‌రిగ‌ణిస్తున్న 13 ల‌క్ష‌ణాల జాబితాలో మ‌రో 2 అంశాల‌ను చేర్చేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ అంతకంతకూ పెరుగుతున్న వేళ లక్షణాల సంఖ్యను పెంచి, కరోనా కేసులను గుర్తించి.. నిరోధక చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం భావిస్తోంది.

క‌రోనా అల‌ర్ట్ః వైర‌స్ పరీక్షల్లో మరో రెండు లక్షణాలు
Jyothi Gadda
|

Updated on: Jun 11, 2020 | 5:09 PM

Share

క‌రోనా టెస్టుల కోసం ప్ర‌స్తుతం ప‌రిగ‌ణిస్తున్న 13 ల‌క్ష‌ణాల జాబితాలో మ‌రో 2 అంశాల‌ను చేర్చేందుకు కేంద్రం సిద్ధ‌మ‌వుతోంది. వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ అంతకంతకూ పెరుగుతున్న వేళ లక్షణాల సంఖ్యను పెంచి, కరోనా కేసులను గుర్తించి.. నిరోధక చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం భావిస్తోంది. వైర‌స్ సోకిన కొంద‌రిలో వాస‌న చూసే శ‌క్తి, రుచిని గుర్తించే శ‌క్తి త‌గ్గిన‌ట్లు వైద్యులు గుర్తించారు. ఈ రెండు లక్షణాలను కూడా కరోనా పరీక్షలు జరిపేందుకు ఆధారంగా తీసుకునే అంశాన్ని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) పరిశీలిస్తోంది. కొవిడ్-19పై ఐసీఎంఆర్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్.. ప్రపంచవ్యాప్తంగా లభ్యమవుతున్న వైద్య గణాంకాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై అధ్యయనం చేసింది.

దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను చేసేందుకు ప్రస్తుతం 13 లక్షణాలను పరిగణిస్తున్నారు. ఈ జాబితాకు రుచి, వాసన శక్తిని కోల్పోయే లక్షణాలను చేర్చనున్నారు. రుచి, వాసన కోల్పోవడాన్ని కరోనా వైరస్ ముఖ్య లక్షణాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే గుర్తించింది. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాతో పాటు పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఈ అంశాన్ని ఏప్రిల్‌లోనే దీన్ని గుర్తించాయి. పలు దేశాలు కొవిడ్-19 లక్షణాల్లో ఈ రెండింటినీ చేర్చి పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. మీ కోసమే ఈ కొత్త ఏటీఎం
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
వైట్‌ బాల్‌తో హీరో.. రెడ్ బాల్‌తో జీరో.. టీమిండియా పాలిట విలన్..?
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
తెలంగాణలో MBBS, BDS ఫీజులు ఖరారు.. 4 ఏళ్ల పాటు పాత ఫీజులే..
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
హీరోగా విమర్శలు.. డైరెక్టర్‏గా బ్లాక్ బస్టర్ హిట్స్.. ఎవరో గుర్తు
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా..
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
ఎన్నో కళలలో ప్రపంచాన్ని చుట్టేదామని బయల్దేరింది..గమ్యం చేరకుండానే
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
మొబైల్ ద్వారా రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయడం ఎలా..?
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
సొంతగడ్డపై ఆసీస్‌కు దిమ్మతిరిగే షాక్.. బంగ్లా బౌలర్ల ధాటికి
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కలకలం.. ఎన్ని లక్షలో తెలుసా?
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..
అతడంటే పిచ్చి ఇష్టం.. పెద్ద అభిమానిని..