ఈ నెల 21 నుంచి “అనంత” లాక్‌డౌన్..
కోవిడ్-19 పంజా ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకుల వణికిపోతోంది. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అత్యధిక పాజిటివ్ కేసులతో ఒంగోలు జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలోనూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 21వ తేదీ నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు ఓ ప్రకటన […]

కోవిడ్-19 పంజా ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిగురుటాకుల వణికిపోతోంది. రోజు రోజుకూ వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అత్యధిక పాజిటివ్ కేసులతో ఒంగోలు జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలోనూ లాక్‌డౌన్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
అనంతపురం జిల్లాలో 21వ తేదీ నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా ఎస్పీ ఏసుబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ ముందుగా అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి, యాడికి, హిందూపురం, కదిరితో పాటు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కాగా.. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దుకాణాలకు అనుమతి ఉంటుంది. ఆ తర్వాత ఎవరూ రోడ్డు మీదకు రాకూడదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా నడుస్తాయి. మాంసం దుకాణాలు ఆదివారం పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. ఇక వారం రోజుల తర్వాత పరిస్థితిని బట్టి లాక్‌డౌన్ కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటారు.
మరోవైపు, ఏపీలో గడిచిన 24 గంటల్లో 465 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 7,961కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 376 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 70 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 19 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో నాలుగు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 96కి చేరింది. అలాగే 3,960 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
