ఉత్తరాఖండ్‌లో మరో 25 కరోనా కేసులు
ఉత్తరాఖండ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్‌లాక్ 1.0 తర్వాత కరోనా కేసులు రాష్ట్రంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఉత్తరాఖండ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అన్‌లాక్ 1.0 తర్వాత కరోనా కేసులు రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఉన్న కేసులు.. రెండు వేలు దాటాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,127కి చేరింది. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 1,423 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. మరో 26 మంది కరోనా బారినపడి మరణించారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 663 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలావుంటే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే 3.8 లక్షలు దాటాయి. అయితే వీటిలో ఇప్పటికే 2.04లక్షల మంది కోలుకోవడం.. కాస్త ఊరటనిస్తోంది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 12 వేల మందికి పైగా మరణించారు. ప్రస్తుతం 1.25 లక్షల కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.