కర్ణాటకలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్..

కర్ణాటకలో లక్షన్నర దాటిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా కర్ణాటకలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే లక్షన్నర మార్క్‌ను దాటేసింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 5,619 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,51,449కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 74,679 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ
విషయాన్ని కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,804 మంది మరణించారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Click on your DTH Provider to Add TV9 Telugu