తమ్ముడికి కరోనా..భయంతో అన్న ఆత్మహత్య
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా... భారత్‌లోనూ విలయతాండవం చేస్తోంది. మనుషుల్లోని మానవత్వానికి కరోనా పెద్ద సవాల్‌గా మారుతోంది. మానవ సంబంధాల్ని మంటగలిపేస్తోంది. పిట్టల్లా ప్రాణాలు పోతుంటే..అయినవారు కూడా అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేని దుస్థితి ఎదురవుతోంది. మరికొందరు వైరస్ లక్షణాలు కనిపించగానే..

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా… భారత్‌లోనూ విలయతాండవం చేస్తోంది. మనుషుల్లోని మానవత్వానికి కరోనా పెద్ద సవాల్‌గా మారుతోంది. మానవ సంబంధాల్ని మంటగలిపేస్తోంది. పిట్టల్లా ప్రాణాలు పోతుంటే..అయినవారు కూడా అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేని దుస్థితి ఎదురవుతోంది. మరికొందరు వైరస్ లక్షణాలు కనిపించగానే భయంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తన తమ్ముడికి కరోనా సోకిందన్న బాధ, భయంతో ఓ అన్న ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం కోలారు నగరంలో జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్ కాలనీలో నివాసముంటున్న 37 ఏళ్ల వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడి తమ్ముడికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు అతన్ని కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. దీంతో తన తమ్ముడికి సోకిన కరోనా తనకు కూడా సోకి ఉంటుందేమోనని, అతడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు ఉరికి వేలాడుతున్న అతన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అటు తమ్ముడు కరోనాతో ఆస్పత్రి పాలవ్వడం.. ఇటు అన్న భయంతో ఆత్మహత్య చేసుకోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
Read more: http://ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభణ… 800 దాటిన కేసులు




