AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు ‘ఇసుక’ సిరులు

తెలంగాణ సర్కార్‌కు 'ఇసుక' సిరులు కురింపిచనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో తాజాగా మరో 10 ఇసుక రీచ్‌ల టెండర్లు ఖరారు చేసింది. దసరా పండుగ నాటికి కొత్త రీచ్‌లు ప్రారంభమయ్యే...

తెలంగాణకు 'ఇసుక' సిరులు
Sanjay Kasula
|

Updated on: Jul 20, 2020 | 11:53 AM

Share

Telangana reaps it rich in sand sale : తెలంగాణ సర్కార్‌కు ‘ఇసుక’ సిరులు కురింపిచనున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో తాజాగా మరో 10 ఇసుక రీచ్‌ల టెండర్లు ఖరారు చేసింది. దసరా పండుగ నాటికి కొత్త రీచ్‌లు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ నుంచి కాళేశ్వరం వరకు 10 ఇసుక రీచ్‌లకు ఈనెల 3న టెండర్లు పిలవగా.. మొత్తం 270 బిడ్లు దాఖలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ( TSMDC)కార్యాలయంలో ఇటీవల లక్కీ డ్రా ద్వారా టెండర్లు ఖరారు చేశారు.

ఒక్కో రీచ్‌లో 7.30లక్షల క్యూబిక్‌ చొప్పున మొత్తం పది రీచ్‌లలో 73లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. క్యూబిక్‌ మీటరుకు రూ.600చొప్పున TSMDC విక్రయించింది. అయితే ఈ లెక్కన సర్కారుకు సుమారు రూ.438కోట్ల వరకు ఆదాయం జమ కానుంది.

అలాగే, టెండర్ల రూపంలో TSMDCకి ఇప్పటికే భారీగా ఆదాయం వచ్చింది. 270 మంది దరఖాస్తుదారుల నుంచి తిరిగి చెల్లించని ఫీజు రూపంలో రూ.67లక్షలు, ఒక్కో రీచ్‌కు రూ.7లక్ష35వేల చొప్పున మొత్తం రూ.73.50లక్షల రాబడి వచ్చింది. మొత్తంగా టెండర్ల ద్వారా రూ.1.40 కోట్ల ఆదాయం సమకూరిందని అంచనా.. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఇసుక సిరి అని చెప్పుకోవచ్చు.