నేటి నుంచి బ్యాంకుల్లో ఆ సేవలన్నీ బంద్!

బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఖాతాదారుడు ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిన‌ విష‌యం ఇది. ఎందుకంటే.. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం ..

నేటి నుంచి బ్యాంకుల్లో ఆ సేవలన్నీ బంద్!
Follow us

|

Updated on: Mar 23, 2020 | 11:09 AM

బ్యాంక్ ఖాతా ఉన్న ప్ర‌తి ఖాతాదారుడు ఖ‌చ్చితంగా తెలుసుకోవాల్సిన‌ విష‌యం ఇది. ఎందుకంటే.. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా జ‌న‌తా క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. ప్ర‌భుత్వ, ప్రైవేటు ఉద్యోగులు చాలా వ‌ర‌కు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో చాలా ర‌క‌లా ప్ర‌జాసేవ‌లు నిలిచిపోయాయి. కొన్నింటిలో వెసులుబాటు క‌ల్పించారు. అందులో భాగంగానే ప‌లు బ్యాంకులు కూడా అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. బ్యాంకుల్లో మార్చి 23 నుంచి కేవలం కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్న‌ట్లు ప్ర‌క‌టించాయి.వివ‌రాల్లోకి వెళితే…

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా ప్రభావం పడుతున్న తరుణంలో తమ అనుబంధ బ్యాంకులు కస్టమర్లకు మెరుగైనా సేవలు అందిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఐబీఏ పేర్కొంది. కస్టమర్లకు అవరమైన సేవలన్నింటినీ సాధ్యమైనంత వరకు అందజేస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ, ఖాతాదారుల‌కు ఒక ముఖ్య‌మైన విన‌తి అంటూ…బ్యాంక్ కస్టమర్లు అవసరం ఉంటే తప్ప బ్యాంక్ బ్రాంచులక రావొద్ద‌ని సూచించింది.

క‌రోనా వైర‌స్ విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలనే త‌మ‌ ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నార‌ని చెప్పింది. అందువల్ల త‌మ‌కు కూడా మీ సాయం కావాల‌ని ఐబీఏ వివరించింది. చాలా వరకు బ్యాంకింగ్ సర్వీసులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని,  అందువల్ల మొబైల్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా నాన్ ఎసెన్షియల్ సర్వీసులను పొందొచ్చని సూచించింది. 24 గంటలూ ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నామని పేర్కొంది. ఇంకా అవసరం అయితే బ్యాంక్ బ్రాంచ్‌కు కాల్ చేయొచ్చని, లేదంటే ఐవీఆర్ ఫెసిలిటీ ద్వారా సర్వీసులు పొందొచ్చని తెలిపింది.

మార్చి 23 నుంచి అన్ని బ్యాంకులు కొన్ని సర్వీసులను కచ్చితంగా కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని ఐబీఏ తెలిపింది. క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ క్లియరింగ్, రెమిటెన్స్‌లు, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు వంటి సేవలు తప్పక అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నాన్ ఎసెన్షియల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది.

బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్