AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కట్టడిలో సపోర్ట్ మెడిసిన్‌గా పారాసిట్‌మాల్‌ కీ రోల్ : కేరళ వైద్యులు

కరోనాకు మందు లేదు. ప్రివెన్షన్‌ ఒక్కటే మార్గమని ప్రపంచదేశాలు ఘోషిస్తున్నాయి. ఈ తరుణంలో అనేక దేశాలు ఆ దిశగానే పయనిస్తున్నాయి. కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచదేశాల అధినేతలు ప్రయత్నం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర సర్కార్‌ అనేక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య అంతగా లేకున్నా…పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌కు వెళ్తున్నాయి. వైరస్‌ వ్యాపించకుండా పంజాబ్‌, రాజస్థాన్‌లు ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చాయి. అదే బాటలో ఏపీ, […]

కరోనా కట్టడిలో సపోర్ట్ మెడిసిన్‌గా పారాసిట్‌మాల్‌ కీ రోల్ : కేరళ వైద్యులు
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2020 | 1:09 PM

Share

కరోనాకు మందు లేదు. ప్రివెన్షన్‌ ఒక్కటే మార్గమని ప్రపంచదేశాలు ఘోషిస్తున్నాయి. ఈ తరుణంలో అనేక దేశాలు ఆ దిశగానే పయనిస్తున్నాయి. కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రపంచదేశాల అధినేతలు ప్రయత్నం ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌లో కూడా మహమ్మారి విజృంభిస్తుండటంతో కేంద్ర సర్కార్‌ అనేక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్య అంతగా లేకున్నా…పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని లాక్‌డౌన్‌కు వెళ్తున్నాయి. వైరస్‌ వ్యాపించకుండా పంజాబ్‌, రాజస్థాన్‌లు ఇప్పటికే లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చాయి. అదే బాటలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేరాయి.

దేశంలో మొట్టమొదట కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనా కేరళ రాష్ట్రం అనేక చర్యలు చేపట్టింది. అయితే ఎంతటి రోగానైనా ఆయుర్వేదంతో అడ్డుకట్టే కేరళ కరోనాను నివారించడంలోనూ కొంతమేర విజయం సాధిస్తోంది. ఈసారి ఆయుర్వేద వైద్యం కాకుండా కరోనాపై పారాసిట్‌మాల్‌తో యుద్ధం చేసి.. మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. అయితే చైనా అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బాధితులపై పారాసిట్‌మాల్‌ను ప్రయోగించినట్లు కేరళ వైద్యులు తెలిపారు. తొలుత వైరస్‌ బారిన పడిన వారు తీవ్రమైన జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. వారందరికీ దగ్గు మందుతో కలిపి పారాసిట్‌మాల్‌ వాడినట్లు కేరళ వైద్యులు తెలిపారు. బాధితులకు నాలుగు రోజులపాటు ఇవే మందులను వాడామని..వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చిందని స్పష్టం చేశారు. కరోనాకు పారాసిట్‌మాల్‌ విరుగుడేనంటున్నారు అక్కడి వైద్యులు. ప్రపంచంలోనే కాక భారత్‌లోనూ ఇప్పటి వరకు కరోనాకు సరైన వాక్సిన్‌ కనిపెట్టకపోవడంతో..పలు రాష్ట్రాలు కూడా కేరళ బాటలోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రఖ్యాత రాంమనోహర్‌ లోహియా వైద్యులు కూడా కేరళ వైద్యులను సంప్రదించి.. సలహాలు, సూచనలు తీసుకున్నారు.

కేరళలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండడంతో..అందుకు తగ్గట్టే అక్కడి ప్రభుత్వం కూడా ఆంక్షలను అమలు చేస్తోంది. రాష్ట్రం మొత్తం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. క్రిమి సంహాకర మందులు స్ఫ్రే చేశారు. కరోనాపై అవగాహన కల్పించారు. కరోనా బాధితులకు పారాసిటమాల్‌నే ఇస్తూ…వ్యాధిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టాబ్లెట్‌ మంచి ఫలితాన్నే ఇస్తుందని అక్కడి ప్రభుత్వం కూడా అంగీకరించింది. దగ్గు జలుబుతో బాధపడుతున్న వారికి వీటినే ఇవ్వడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెబుతోంది కేరళ ప్రభుత్వం.