రిమోట్ కంట్రోలర్‌తో కొత్త మాస్కులు.. ఇలా తినొచ్చు.. తాగొచ్చు

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు మాస్క్, శానిటైజర్స్ లేకుండా ఎవరూ కనిపించడం లేదు. మాస్క్ లేకుండా రోడ్ల పైకి వస్తే పోలీసు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు..

రిమోట్ కంట్రోలర్‌తో కొత్త మాస్కులు.. ఇలా తినొచ్చు.. తాగొచ్చు

కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు మాస్క్, శానిటైజర్స్ లేకుండా ఎవరూ కనిపించడం లేదు. మాస్క్ లేకుండా రోడ్ల పైకి వస్తే పోలీసు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు కూడా పెడుతున్నారు. ఇంకా ఈ వైరస్‌కి వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడంతో.. పలు దేశాలు లాక్‌డౌన్‌‌ను పొడిస్తూనే ఉన్నాయి. అయితే మాస్క్ వల్ల చాలా మంది తిప్పలు పడుతున్నారు. ఏదన్నా తినాలన్నా.. తాగాలన్నా తప్పనిసరిగా మాస్క్ తీయాల్సి ఉంటుంది.

కానీ అలా చేయకుండానే ఎంచక్కా.. తినేయోచ్చు అంటున్నారు ఇజ్రాయోల్ దేశానికి చెందని తయారీ దారులు. చేతిలో ఉన్న హ్యాండ్ రిమోట్‌ను నొక్కగానే నోటి భాగానికి సరిపడా మాస్క్ తెరుచుకునే కొత్త మాస్క్‌ని మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. దీనిని ఎవిటిపస్ పేటెంట్స్, ఇన్వెన్షన్ సహాధ్యక్షుడు అసఫ్ గిటెలిస్ తయారు చేశారు. దీంతో మాస్క్ తీయకుండానే ఎంచక్కా ఆహారం తీసుకోవచ్చు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తాము పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామంటున్నారు. అయితే దీని ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. రూ.60 నుంచి 200ల వరకూ ఉండొచ్చు. మాస్క్‌ను హ్యాండ్ రిమోట్‌తో తెరుచుకొనేలా చేయడం లేదా ఫోర్క్‌ని నోటి వద్దకు తీసుకురాగానే ఆటోమెటిక్‌గా మాస్క్ తెరుచుకుంటుందని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: 

టెన్త్ స్టూడెంట్స్‌కి గుడ్‌‌న్యూస్.. బిట్ పేపర్ తొలగింపు

షాకింగ్ న్యూస్.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి