పాల డబ్బాల్లో మద్యం సీసాలు.. దారి తప్పి..

India Lockdown: దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మందుబాబులు మద్యం దొరక్క చిత్రవిచిత్రమైన దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో పాల క్యానుల్లో మద్యం సీసాలు తీసుకెళ్తు ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని బులంద్‌షహర్‌కు చెందిన బాబీ చౌదరీ పాల వ్యాపారం చేస్తుండేవాడు. తన దగ్గర బంధువు పుట్టినరోజు వేడుకకు ఏడు మద్యం సీసాలను పాల డబ్బాల్లో దాచి పెట్టి తీసుకెళ్ళే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. ఆదివారం అర్ధరాత్రి వేళ బాబీ రోడ్డుపై […]

పాల డబ్బాల్లో మద్యం సీసాలు.. దారి తప్పి..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 2:18 PM

India Lockdown: దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా మందుబాబులు మద్యం దొరక్క చిత్రవిచిత్రమైన దారులు ఎంచుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో పాల క్యానుల్లో మద్యం సీసాలు తీసుకెళ్తు ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని బులంద్‌షహర్‌కు చెందిన బాబీ చౌదరీ పాల వ్యాపారం చేస్తుండేవాడు. తన దగ్గర బంధువు పుట్టినరోజు వేడుకకు ఏడు మద్యం సీసాలను పాల డబ్బాల్లో దాచి పెట్టి తీసుకెళ్ళే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు.

ఆదివారం అర్ధరాత్రి వేళ బాబీ రోడ్డుపై పాల డబ్బాలతో వెళ్తూ పోలీసుల కంట పడ్డాడు. వారికి అనుమానం వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. అది చూసిన బాబీ బండి వేగం పెంచి ముందుకు వెళ్ళిపోయాడు. పోలీసులు అతన్ని వెంబడించి చివరికి రాష్ట్రపతి భవన్ నాలుగో ద్వారం వద్ద పట్టుకున్నారు. అంటువ్యాధుల చట్టం, దిల్లీ ఎక్సైజ్‌ చట్టం, ఐపీసీ, వాహన చట్టం ప్రకారం బాబీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాలకు మార్గదర్శకాలు..