Covid 19 Vaccination: ప్రధాని మోడీ బర్త్‌డే గిఫ్టు.. కోవిడ్ వ్యాక్సినేషన్‌లో మరో రికార్డు.. 2 కోట్ల మైలురాయి క్రాస్..
PM Modi Birthday: భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం నేడు దూసుకుపోతోంది. ఈ రోజు ఇప్పటికే రెండు కోట్ల డోసుల టీకా అందించి రికార్డు సృష్టించింది.
PM Modi Birthday: భారత్‌లో కరోనా టీకా కార్యక్రమం నేడు దూసుకుపోతోంది. ఈ రోజు ఇప్పటికే రెండు కోట్ల డోసుల టీకా అందించి రికార్డు సృష్టించింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా.. టీకా వేయించుకొని ఆయనకు కానుక ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ నేతలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. టీకా తీసుకొని, ఇతరులకు స్లాట్స్ బుక్ చేసి వ్యాక్సిన్ సేవ చేద్దామని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. దీంతో దేశంలో కోవిడ్ టీకా తీసుకునేందుకు జనం కూడా పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్ కేంద్రాలకు తరలివచ్చారు. దీంతో అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన లభించింది. ఈరోజు రెండు కోట్ల వ్యాక్సినేషన్లు జరగడంతో.. దేశవ్యాప్తంగా టోటల్ వ్యాక్సినేషన్ 78కోట్లకు చేరింది. గాంధీ జయంతి కల్లా ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
#LargestVaccineDrive #Unite2FightCorona pic.twitter.com/Uly8hVAZY6
— Ministry of Health (@MoHFW_INDIA) September 17, 2021
శుక్రవారం మధ్యాహ్నం కల్లా కోటి టీకా డోసులు పంపిణీ అయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు 2 కోట్లు మార్క్ దాటేసింది. ఈ లెక్కన నిమిషానికి 50 వేల మందికి టీకాలు వేసినట్లు నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ ట్వీట్ చేశారు. అలాగే రెండు కోట్ల మార్కును దాటడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రధాని నరంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈ రోజు రెండు కోట్ల మందికి టీకాలు ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. అలాగే, ఈ రోజు నుంచి 20 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. ఆగస్టు 31న భారత్ అత్యధికంగా 1.30 కోట్ల టీకా డోసుల్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే.
We crossed two crore vaccinations! In a single day!! Still counting. Kudos to everyone who have helped India achieve this massive feat.
#DigitalTransformation #publichealth #CoWIN pic.twitter.com/yoVToye33e
— Dr. RS Sharma (@rssharma3) September 17, 2021
ఇటు కరోనా కట్టడిపై సీరియస్‌గా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని ఫలితంగా తెలంగాణలో టీకాల కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. అటు, ఆఫీసర్లు కూడా వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించి విస్త్రతంగా కార్యక్రమాలు చేపట్టారు. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ దేశంలో ముందు వరుసలో నిలిచింది. ప్రత్యేక కేంద్రాల ద్వారానే కాకుండా, మొబైల్ సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బుధవారం నాటికి రాష్ట్రంలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. 2 కోట్ల మందికి టీకాలు ఇవ్వడంతో బీఆర్కే భవన్‌లో కేక్ కట్ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని అభినందించారు సీఎస్.
ఇదే స్పూర్తితో రాష్ట్రంలో అందరికీ టీకాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు సోమేశ్‌కుమార్. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని గుర్తుచేశారు సీఎస్. ప్రతీఒక్కరు కచ్చితంగా టీకా తీసుకోవాలని కోరారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు అన్నింటిలోనూ టీకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సోమేశ్‌కుమార్. అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నప్పుడే ఇంకా వేగంగా టీకాల పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ సీఎస్ స్పష్టం చేశారు.
Read Also… సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం.. 36 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఇంటర్మీడియట్ స్థాయికి పెంపు