AP Corona Cases ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో మళ్లీ పెరగుతున్న కేసులు

ఆంధ్రప్రదేశ్‌ కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతోంది.

AP Corona Cases ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో మళ్లీ పెరగుతున్న కేసులు
Corona Virus Today
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 17, 2021 | 6:24 PM

Andhra Pradesh Covid19: ఆంధ్రప్రదేశ్‌ కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ మొదలు పెట్టినట్లు కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ వైరస్ వ్యాప్తి చెందుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 60,350 నమూనాలను పరీక్షించగా కొత్తగా 1,393 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,36,179కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 20,07,330 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 1,296 మంది కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని సం పూర్ణ ఆరోగ్య వంతులయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,797గా ఉందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇదిలావుంటే, రాష్ట్రంలో గత 24గంటల్లో 8 మంది కరోనా రాకాసి కోరలకు బలయ్యారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 14,052కి చేరింది. ఇక, ఇప్పటివరకు రాష్ట్రంలో 2,75,96,989 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు పరిశీలిస్తే.. అనంతపురం జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 272, తూర్పుగోదావరి జిల్లాలో 206, గుంటూరు జిల్లాలో 132, కడప జిల్లాలో 60, కృష్ణాజిల్లాలో 162, కర్నూలు జిల్లాలో 05, నెల్లూరు జిల్లాలో 201, ప్రకాశం జిల్లాలో 120, శ్రీకాకుళం జిల్లాలో 28, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 09, పశ్చిమగోదావరి జిల్లాలో 129 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

Ap Covid 19 Cases

Ap Covid 19 Cases

Read Also…

Viral Video: 45 సెకన్లలలో 15 బిల్డింగ్‌లు కూల్చివేత..! ఆకాశాన్నంటే భవనాలు చూస్తుండగానే.. షాకింగ్‌ వీడియో..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?