India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కేరళలో వైరస్ టెర్రర్

ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. కొత్త​ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. కొత్తగా చేసిన పరీక్షల్లో...

India Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కేరళలో వైరస్ టెర్రర్
India Corona Updates
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 26, 2021 | 10:44 AM

ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్ మొదలైంది. కొత్త​ కేసుల సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. కొత్తగా చేసిన పరీక్షల్లో 46,164 మంది వైరస్​ సోకినట్లు తేలింది. మరో 607 మంది వైరస్ కారణంగా మరణించారు. ఒక్కరోజు వ్యవధిలో 34,159 మంది వ్యాధి బారి నుంచి బయటపడ్డారు. కాగా కొత్తగా నమోదైన కేసుల్లో  31 వేల కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. అంటే దేశవ్యాప్తంగా నమోదయిన కేసుల్లో ఏకంగా 68 శాతం కేసులు కేరళలోనే నమోదయ్యాయి. ఓనం పండగ తర్వాత భారీగా కేసులు వెలుగుచూస్తున్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ పాజిటివ్ కేసులు (5,031) నమోదవుతున్నాయి.

  • మొత్తం కేసులు: 3,25,58,530
  • మొత్తం మరణాలు: 4,36,365
  • మొత్తం కోలుకున్నవారు: 3,17,88,440
  • యాక్టివ్ కేసులు: 3,33,725

బుధవారం ఒక్కరోజే 80,40,407 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 60,38,46,475 వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు తెలిపింది.

పాఠశాలల్లో కరోనా వ్యాప్తి…

కాగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పాఠశాలలు పున:ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. పిల్లలు కరోనా బారిన పడుతుండటం కలకలం రేపుతోంది. ఎక్కడిదాకో ఎందుకో ఏపీలోనే స్కూల్ రీ ఓపెన్ చేసి 10 రోజులు కూడా గడవకముందే 23 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు. అక్టోబరులో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.., చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణలు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.

Also Read: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు టెన్షన్… సడెన్‌గా సీన్‌లోకి ఈడీ ఎంట్రీ.. మనీ లాండరింగ్‌, హవాల వ్యవహారాలు..?

పెద్ద కొడుకు అప్పు చేసి భార్యతో పారిపోయాడు.. అవమానం, బాధ తట్టుకోలేక మిగిలిన కుటుంబమంతా