Good News: చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. దేశంలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే?

దేశాన్ని కరోనా థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్దవారికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే చిన్నారులకు ఇంకా వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి రాకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

Good News: చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్.. దేశంలో ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే?
Children
Follow us

|

Updated on: Aug 26, 2021 | 10:48 AM

దేశాన్ని కరోనా థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి. దేశ వ్యాప్తంగా పెద్దవారికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే చిన్నారులకు ఇంకా వ్యాక్సిన్ ఏదీ అందుబాటులోకి రాకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వ్యాక్సిన్లు తీసుకోనందున థర్డ్ వేవ్‌లో ఎక్కువగా చిన్నారులే బాధితులు కావచ్చన్న వైద్య నిపుణులు హెచ్చరికలతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వర్గాల నుంచి ఓ తీపికబురు అందింది. చిన్నారుల కోసం వ్యాక్సిన్ ఎప్పటి నుంచి దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశముందో ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని మేరకు 12-17 ఏళ్ల చిన్నారుల కోసం జిడస్ క్యాడిలా(Zydus Cadila) వ్యాక్సిన్ అక్టోబర్ నాటికి అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. చిన్నారులకు సంబంధించి దేశంలో ప్రభుత్వ ఆమోదం పొందిన తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం.

ఈ మేరకు కీలక వివరాలను ప్రభుత్వ ఇమ్యునైజేషన్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ డాక్టర్ అరోరా వెల్లడించారు. అదే సమయంలో కోవిడ్-19 వైరస్ కారణంగా చిన్నారులు తీవ్ర అనారోగ్యానికి గురైయ్యే అవకాశాలు తక్కువేనని ఇటీవల నిర్వహించిన సీరో సర్వేలో నిర్థారణ అయినట్లు తెలిపారు. చిన్నారుల కోసం స్కూల్స్‌ను రీ-ఓపన్ చేయడమే మంచిదని సలహా ఇచ్చారు. ఇది వారి మేధస్సును పెంపొందించేందుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. 12-18 ఏళ్లలోపు చిన్నారులు దేశంలో 12 కోట్ల మంది ఉన్నట్లు వెళ్లడించారు. వీరిలో 1 శాతం మంది మాత్రమే వ్యాధి నిరోధక శక్తిని తగ్గించే అనారోగ్య సమస్యలు(హైపర్ టెన్షన్, ఒబేసిటీ) వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వివరించారు. 18-45 ఏళ్ల లోపు వయస్కుల్లో ఈ సమస్య 10-15 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. అందుకే చిన్నారుల కంటే పెద్దవారి వ్యాక్సినేషన్‌కే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.

18 ఏళ్లలోపు చిన్నారులు దేశంలో 44 కోట్ల మంది ఉన్నట్లు డాక్టర్ అరోరా తెలిపారు. వ్యాక్సినేషన్ లేకున్నా వీరు స్కూల్స్‌కు వెళ్లొచ్చన్నారు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు, స్కూల్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాల్సిన అవసరముందన్నారు.

Also Read..

Vaccination: మీరు టీకా తీసుకున్నారా? లేకపోతే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే!

 నెలనెలా రూ.15వేలు చెల్లించండి.. వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఆ సంస్థ

Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
Scam: అర్జెంట్‌గా డబ్బులంటూ ధోనీ నుంచి మెసేజ్‌.. స్పందించారో..
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే