AP Corona: గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా విజృంభణ.. 1,539 కొత్త కేసులు నమోదు

Ap Corona: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు హెచ్చతగ్గులతో నమోదవుతూ ఆందోళలన రేకెత్తిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..

AP Corona: గత 24 గంటల్లో ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా విజృంభణ.. 1,539 కొత్త కేసులు నమోదు
Ap Corona
Follow us
Surya Kala

|

Updated on: Aug 26, 2021 | 7:15 PM

Ap Corona: ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. రోజువారీ కేసులు హెచ్చతగ్గులతో నమోదవుతూ ఆందోళలన రేకెత్తిస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,539 మంది కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్యా 20,04,835 లకు చేరుకుంది. బాధితుల్లో ఇప్పటివరకు 19,79,504 మంది కోలుకున్నారు.

ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 67,590 శాంపిల్స్ ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో కరోనాతో 16 మంది మరణించారు. కోవిడ్ వల్ల చిత్తూర్ లో ముగ్గురు, కృష్ణ లో ముగ్గురు, ప్రకాశంలో ఇద్దరు, తూర్పు గోదావరి, కర్నూల్, నెల్లూరు , శ్రీకాకుళం లలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో కరొనతో మరణించిన వారి మొత్తం సంఖ్య 13,778 కు చేరుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 14,448 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి గడచిన 24 గంటల్లో 1,140 మంది పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతులు అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డిశార్జ్ అయినవారి సంఖ్య 19,79,704లకు చేరుకుంది.నేటి వరకు రాష్ట్రం లో 2,63,37,946 సాం పిల్స్ ని పరీక్షిం చడం జరిగిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

Also Read:

చిన్నారులు కడుపునొప్పి, రక్తహీనతతో బాధపడుతున్నారా.. అయితే నులిపురుగులు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..

 రెస్టారెంట్ స్టైల్‌లో ఇంట్లోనే టేస్టీ టేస్టీ టమాటా సూప్ తయారీ.. అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు