దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..

దేశంలో మూడోదశ లాక్‌డౌన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 17 వరకు అమలు కానున్న ఈ లాక్ డౌన్‌లో కేంద్రం.. రెడ్ జోన్లలో కఠినతరమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అంతేకాక ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్నింటిపై సడలింపులు ఇచ్చింది. అటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని.. అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని స్పష్టం చేసింది. ఇక జోన్లతో సంబంధం లేకుండా 65 […]

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ 3.0.. తెరుచుకునేవి ఇవే..
Follow us

|

Updated on: May 04, 2020 | 11:03 AM

దేశంలో మూడోదశ లాక్‌డౌన్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 17 వరకు అమలు కానున్న ఈ లాక్ డౌన్‌లో కేంద్రం.. రెడ్ జోన్లలో కఠినతరమైన ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది. అంతేకాక ఆరెంజ్, గ్రీన్ జోన్లలో కొన్నింటిపై సడలింపులు ఇచ్చింది. అటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని.. అత్యవసరం అయితేనే తప్ప ఎవరూ బయటికి రాకూడదని స్పష్టం చేసింది. ఇక జోన్లతో సంబంధం లేకుండా 65 ఏళ్లు పైబడిన వృద్దులు, రోగులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు, గర్భిణిలు బయటికి రాకూడదు. అటు మద్యం విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువుల డెలివరీ చేసేందుకు ఈ కామర్స్ సంస్థలకు కూడా అనుమతులు ఇచ్చింది. ఈ క్రమంలోనే కేంద్రం ఇచ్చిన సడలింపులకు ఏపీ ప్రభుత్వం ఓకే చెప్పగా.. తాజా సడలింపులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

కేంద్రం ప్రకటించిన సడలింపులు:

కంటైన్‌మెంట్‌ ఏరియాస్: ప్రజల ఎంట్రీ, ఎగ్జిట్ నిషేధం. అంతేకాక ఈ ఏరియాలలో ఉంటున్నవారు అత్యవసర వస్తువులకు ఇంటి నుంచి కేవలం ఒక్కరు మాత్రమే బయటికి రావాలి. మిగిలిన కమర్షియల్ సర్వీసులు అన్నీ కూడా నిషేధం.

రెడ్ జోన్లు: ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్స్, ప్రజా రవాణా, బార్బర్ షాపులు, స్పాస్, సెలూన్స్, మాల్స్ నిషేధం. కారుల్లో డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు, అలాగే మోటార్ వెహికిల్స్‌పై ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రైవేట్ ఆఫీసులకు 33 శాతం స్టాఫ్‌తో అనుమతి, ఈ- కామర్స్ సంస్థలు కేవలం అత్యవసర వస్తువులు మాత్రమే డెలివరీ చేయాలి. నిత్యావసరాల మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, ఫార్మా కంపెనీలు, ఐటీ హార్డ్‌వేర్‌, జూట్ మిల్లులకు అనుమతి. వీటిల్లో పని చేసేవారు సామాజిక దూరాన్ని పాటిస్తూ.. మాస్క్‌ను తప్పకుండా ధరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలకు అనుమతి ఉంటుంది. నిర్మాణ పనులను స్థానిక కూలీలతో నిర్వహించాలి. వ్యవసాయ పనులు చేసుకోవచ్చు.

ఆరెంజ్ జోన్లు: ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లకు డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లకు అనుమతి, బస్సులకు అనుమతి లేదు, టూ వీలర్‌పైన ఇద్దరు వెళ్ళొచ్చు.

గ్రీన్ జోన్లు: నేషనల్ వైడ్‌లో నిషేదించిన అన్నింటికీ ఇక్కడ అనుమతి ఉంది, బస్సులు 50 శాతం క్యాపాసిటీతో నడపవచ్చు. వైన్, పాన్ షాపులకు కూడా అనుమతి ఉంది. అయితే ఆరడుగుల సామాజిక దూరాన్ని పాటించడమే కాకుండా ఒకేసారి షాపు దగ్గర 5 గురికి మించి ఉండకూడదు.

Read More: 

నేటి నుంచి ఏపీలో మద్యం షాపులు ఓపెన్.. టైమింగ్స్ ఇవే..

జగన్ సర్కార్ సంచలనం.. ఇకపై ఇంటర్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం..

వారిని మాత్రమే తరలించాలి.. కేంద్రం క్లారిటీ..

ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
ఈ దృశ్యాలు చూస్తే.. మంచు కురిసే వేళలో అంటూ.. వీడియో వైరల్.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
వాహ్‌! ఐస్ టీ.. మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
పుష్ప2 ఇక అవనట్టే! | ఒకే వీడియోలో ఇద్దరూ ఏడ్చేసిన సమంత.
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
పొదుపా.. పెట్టుబడా.. రెండింటి మధ్య తేడా ఏమిటి?
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
బిజినెస్‌ కోసం డబ్బు కావాలా? ఎన్‌పీఎస్‌ విత్‌డ్రాలో రూల్స్ మార్పు
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.!
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
బైక్‌పై వెళ్తున్న యువకునికి గుండెపోటు! 26 ఏళ్లకే నూరేళ్లూ నిండాయి
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?
వన్‌ప్లస్ 12ఆర్ కొన్నవారికి డబ్బులు వెనక్కి.. ఎందుకంటే.?