AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. వేడుకలు ముందున్నాయి’.. టైగర్‌కు చెర్రీ విషెస్..

'మై డియర్ బ్రదర్ ఎన్టీఆర్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నాకు తెలుసు. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని మాటిస్తున్నా. వేడుకలు ముందున్నాయంటూ' చెర్రీ..

'నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. వేడుకలు ముందున్నాయి'.. టైగర్‌కు చెర్రీ విషెస్..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 20, 2020 | 2:07 PM

Share

బాలనటుడిగా ఒదిగిపోయి.. హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఎదిగి.. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్బంగా.. పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో ఎన్టీఆర్‌కు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీ, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో వస్తుందని అభిమానులందరూ ఆశించారు. కానీ లాక్‌డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎన్టీఆర్‌కి.. రాజమౌళి, చెర్రీలు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

‘మై డియర్ బ్రదర్ ఎన్టీఆర్ నీకు జన్మదిన శుభాకాంక్షలు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నాకు తెలుసు. నీకు బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని మాటిస్తున్నా. వేడుకలు ముందున్నాయంటూ’ చెర్రీ ట్వీట్ చేశాడు. ఇక రాజమౌళి ద్వారా ఎన్టీఆర్‌కు విషెస్ చెప్పారు. ‘కెరీర్ ప్రారంభం నుంచి నువ్వు నా ప్రయాణంలో భాగమైనందుకు సంతోషపడుతున్నా.. హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. భీమ్ పాత్రకు నీ కంటే ఉత్తమ నటుడు నాకు దొరకలేదు’ అంటూ పోస్ట్‌ చేశాడు రాజమౌళి.

View this post on Instagram

I am glad you were a part of my journey from the start! Happy birthday dear Tarak. I couldn’t have found a better Bheem 🙂

A post shared by SS Rajamouli (@ssrajamouli) on