లాక్‌డౌన్‌ పాటిస్తారా. లాకప్‌లో ఉంటారా..!

ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా.. పలుచోట్ల కొందరు మాత్రం యథేచ్చగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇంట్లో ఉండాలని ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదు. గుంటూరు ప్రాంతంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పనితీరును గుంటూర్‌ రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు పరిశీలించారు. జిల్లాలోని శంకర్ విలాస్ సెంటర్‌లో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఐజీ ప్రభాకర్ రావ్ మాట్లాడుతూ.. ప్రజలంతా […]

లాక్‌డౌన్‌ పాటిస్తారా. లాకప్‌లో ఉంటారా..!
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 9:38 PM

ఏపీలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినా.. పలుచోట్ల కొందరు మాత్రం యథేచ్చగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఇంట్లో ఉండాలని ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెప్పినా.. పట్టించుకోవడం లేదు. గుంటూరు ప్రాంతంలో లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీస్ సిబ్బంది పనితీరును గుంటూర్‌ రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు పరిశీలించారు. జిల్లాలోని శంకర్ విలాస్ సెంటర్‌లో పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఐజీ ప్రభాకర్ రావ్ మాట్లాడుతూ.. ప్రజలంతా లాక్‌డౌన్ పాటించాలన్నారు. గుంటూరులో రెండు కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో.. వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించామన్నారు. వారందరినీ క్వారంటైన్‌కు పంపించినట్లు తెలిపారు.

అంతేకాదు.. రెండు పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు వెల్లడించారు. ఆ ప్రాంతంలో కరోనా నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటించాలని.. లేనిపక్షంలో లాకప్‌లో ఉండాలని ఐజీ ప్రభాకర్‌రావు హెచ్చరించారు.