కరోనా లాక్‌డౌన్‌: లిక్కర్ షాపులు తెరవాలట.. నటుడి అభ్యర్థన

కరోనా ప్రపంచమంతా విస్తరిస్తోన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా లాక్‌డౌన్‌: లిక్కర్ షాపులు తెరవాలట.. నటుడి అభ్యర్థన
Follow us

| Edited By:

Updated on: Mar 28, 2020 | 10:10 PM

కరోనా ప్రపంచమంతా విస్తరిస్తోన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అత్యవసర సేవలు తప్ప మిగిలినవేవి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో జనాలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక కరోనా ఎఫెక్ట్ మందుబాబులపై బాగా పడింది. తాగడానికి చుక్క లేక మందుబాబులు విలవిలలాడుతున్నారు. బ్రాండ్ కాదు.. ఓ పెగ్గు దొరికితే చాలంటూ వారు ఎదురుచూస్తున్నారు. కొందరైతే రోజులు రెండు గంటలు అయినా లిక్కర్ స్టోర్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్‌ లిక్కర్ షాపులు తెరవాలంటూ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.

”లైసెన్స్‌డ్‌ మద్యం షాపులైనా సాయంత్రం పూటా కాసేపు తెరిచే విషయంపై ప్రభుత్వం ఆలోచించాలి. నన్ను తప్పుగా అనుకోకండి. చాలామంది మగవాళ్లు ఇంట్లో డిప్రెషన్‌తో ఉంటారు. ఇలాంటి సమయంలో పోలీసులు, డాక్టర్లు, ప్రజలకు మద్యం చాలా అవసరం. బ్లాక్‌లో అయినా మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండి” అని ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా.. ”ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చే డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా అవసరం. ఫ్రస్టేషన్‌కు డిప్రెషన్‌ తోడు అవ్వకూడదు” అని కామెంట్ చేశారు. ఇక ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఉన్నతంగా ఆలోచించండి రిషిజీ. ఎంతోమంది నిత్యావసర వస్తువులు కూడా లేకుండా బాధపడుతున్నారు. టీవీల్లో వార్తలు చూసైనా దేశంలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకోండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read This Story Also: కరోనా వైరస్: సొంతూరి కోసం లెక్కల మాస్టార్ ఉదార భావం..!