కరోనా పేషెంట్ల డైట్‌లో మార్పులు…వాటి వివరాలు

కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌లో మార్పులు చేశారు. కరోనా రోగుల పట్ల గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ..ప్రభుత్వం, మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని..

కరోనా పేషెంట్ల డైట్‌లో మార్పులు...వాటి వివరాలు
Follow us

|

Updated on: Jul 03, 2020 | 12:34 PM

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌లో మార్పులు చేశారు. కరోనా రోగుల పట్ల గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహిరస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ..ప్రభుత్వం మరింత పారదర్శకంగా వ్యవహరించాలని, కరోనా రోగుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారికి పోషకాలతో కూడిన ఆహారాన్నిఅందించాలని మరోసారి సీరియస్‌గా ఆదేశించింది. ఈ మేరకు కోవిడ్ పేషెంట్లకు అందిస్తున్న డైట్‌ను మార్చారు. ఉదయం టిఫిన్ నుంచి రాత్రి డిన్నర్ వరకూ పోషక విలువలతో కూడిన ఆహారాన్ని డిస్పోజబుల్ పాత్రల్లో మాత్రమే అందించాలని ఆస్పత్రి వర్గాలు నిర్ణయించాయి. వారికి ఇచ్చే డైట్‌ను పరిశీలించినట్లయితే…

* ఉదయం 7.30గంటల నుంచి 8.00 గంటల మధ్య అల్పాహారంగా ఇడ్లీ, పూరి, బొండా, ఉప్మా, ఊతప్పం లలో ఏదో ఒకదానితో పాటు పాలు అందిస్తారు.

* ఉదయం 10 గంటలకు బిస్కెట్లతో పాటు టీ లేదా కాఫీ ఇస్తారు.

* మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య అన్నం, పప్పు, సాంబారు, పెరుగు, కోడిగుడ్డు, అరటిపండు, కూర, మినరల్ వాటర్ బాటిల్‌ను ఇస్తారు.

* సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల్లోపు ప్రత్యేక పోషకాహారంగా కాఫీ లేదా టీతో పాటు ఖర్చూరం, బాదంపప్పు, ఆంజీర్ ఇస్తారు.

* రాత్రి డిన్నర్‌లో అన్నంతో పాటు కూర, సాంబారు, పెరుగు, పప్పు, మరో కోడిగుడ్డు, అరటిపండు, మినరల్ వాటర్ అందజేస్తారు.

ఇక ఆస్పత్రిలోని వైద్యులు, పారిశుద్ద్య సిబ్బంది, వార్డు బాయ్స్, నర్సులకు కూడా ఇదే డైట్‌ను ఇస్తున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..