నాగాలాండ్‌లో తొలి కరోనా మరణం
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో కూడా రోజురోజుకు కేసుల సంఖ్యతో పాటుగా.. కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయిత దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో కూడా రోజురోజుకు కేసుల సంఖ్యతో పాటుగా.. కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. అయిత దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉంది. అందులో నాగాలాండ్ కూడా ఒకటి. అయితే ఇన్నాళ్లకు అక్కడ కరోనా తొలి మరణం సంభవించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1,239 నమోదయ్యాయి. వీటిలో ప్రస్తుతం నాగాలాండ్ వ్యాప్తంగా 701 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా నుంచి కోలుకుని 537 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక శుక్రవారం నాడు దిమాపూర్ జిల్లాలో ఓ వ్యక్తి కరోనా బారిన పడి ఆస్పత్రిలోనే మరణించారు. ఆయన వయస్సు 65 ఏళ్లు. ఈ విషయాన్ని నాగాలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.



