ఏపీలో ఐదో విడత ఉచిత రేషన్ రెడీ..

రాష్ట్రంలోని పేదలకు ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 29 లేదా 30 నుంచి సరుకులను పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయనుంది. ఈ విడతలో కూడా లబ్దిదారులకు 5 కిలోల బియ్యంతో పాటు కిలో కందిపప్పును ఇవ్వనున్నారు. సుమారు 1.48 కోట్ల కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పును ఇప్పటికే రేషన్ షాపులకు తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. మరోవైపు మార్చి 29 నుంచి ఇప్పటివరకు […]

ఏపీలో ఐదో విడత ఉచిత రేషన్ రెడీ..
Follow us

|

Updated on: May 25, 2020 | 1:24 PM

రాష్ట్రంలోని పేదలకు ఐదో విడత ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు జగన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 29 లేదా 30 నుంచి సరుకులను పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయనుంది. ఈ విడతలో కూడా లబ్దిదారులకు 5 కిలోల బియ్యంతో పాటు కిలో కందిపప్పును ఇవ్వనున్నారు. సుమారు 1.48 కోట్ల కార్డుదారులకు అవసరమైన బియ్యం, కందిపప్పును ఇప్పటికే రేషన్ షాపులకు తరలించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

మరోవైపు మార్చి 29 నుంచి ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం పేదలకు నాలుగు విడతలుగా ఉచితంగా సరుకులు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతీసారి లబ్దిదారులకు టైం స్లాట్ ఉన్న కూపన్లను ఇస్తారు. అవి తీసుకుని కార్డుదారులు సంబంధిత రేషన్ షాపులకు వెళ్లి సరుకులను తీసుకుంటుంటారు. కాగా, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం లబ్ధిదారుల బయోమెట్రిక్ తప్పనిసరి. కరోనా నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి రేషన్ దుకాణాల వద్ద తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.