షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలూ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అన్నీ ఒక్కసారిగా బంద్ అయిపోయాయి. అయితే ఇన్నాళ్లూ మద్యం దొరకకపోవడంతో మందు బాబులు..

  • Tv9 Telugu
  • Publish Date - 4:17 pm, Mon, 4 May 20
షాపుల ముందు మందు బాబుల క్యూ లైన్‌ చూసి షాక్‌ అయిన చంద్రబాబు!

కరోనా వైరస్ విజృంభిస్తోన్న కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలూ లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో అన్నీ ఒక్కసారిగా బంద్ అయిపోయాయి. అయితే ఇన్నాళ్లూ మద్యం దొరకకపోవడంతో మందు బాబులు విలవిల్లాడిపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల కార్యకలాపాలు చేసుకోవచ్చని పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈమేరకు మద్యం అమ్మకాలకు కూడా అనుమతిచ్చాయి. దీంతో పలు షాపుల ముందు.. మందు ప్రియులు దుకాణాల వద్ద కిలో మీటర్ల మేర బారులు తీరారు. అలాగే మద్యం అమ్మకాలకు ప్రత్యేక టైమింగ్స్ కూడా కేటాయించింది.

సాయంత్రం 7 గంటల వరకే మద్యం అమ్మకాలు కొనసాగుతాయని ప్రభుత్వం చెప్పడంతో.. ఎలాగైనా లిక్కర్ అందుకునేందుకు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఐదుగురు మాత్రమే షాపు వద్ద ఉండాలన్న రూల్ పక్కన పెట్టి భారీ సంఖ్యలో క్యూ లైన్లలో దర్శన మిస్తున్నారు. కనీసం కొన్నిలిక్కర్ షాపుల ముందు అయితే మాస్కులు, సోషల్ డిస్టెన్స్ కూడా పాటించకుండా.. ఒకరి మీద ఒకరు పడిపోతూ.. లైన్లలో నిలుచున్నారు జనం. కరోనాతో ప్రాణం మీదకు వస్తుందన్న సంగతి కూడా మరిచిపోయారు.

ఇక ఇదే విషయంపై మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. మందు షాపుల ముందు క్యూ లైన్లు చూసి షాక్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్‌లో ట్వీట్ కూడా చేశారు. సీఎం జగన్‌ను ట్యాగ్ చేసి.. మద్యం షాపుల ముందు కనీస నియమాలు కూడా పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.