ప్రతి వ్యక్తీ ఫేస్ మాస్క్ ధరించనక్కర్లేదు.. కేంద్రం క్లారిటీ
కరోనా భయం గుప్పిట్లో నలుగుతున్న ఈ తరుణంలో దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు ముఖాలకు మాస్కులు ధరించి తిరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది.
కరోనా భయం గుప్పిట్లో నలుగుతున్న ఈ తరుణంలో దేశంలో ప్రతి నలుగురిలో ముగ్గురు ముఖాలకు మాస్కులు ధరించి తిరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. ప్రతివారూ ఈ మాస్కులు ధరించనక్కర్లేదని స్పష్టం చేసింది. కేవలం మూడు కేటగిరీల వారికే ఇవి అవసరమవుతాయని తెలిపింది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నవారు మొదటి రకం కేటగిరీ కాగా.. కరోనా సోకినవారికి సేవలు చేస్తున్నవారు రెండో కేటగిరీ అని, ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నవారికి సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లు మూడో కేటగిరీ అని వివరించింది. వీరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్లో సూచించింది. ఇందుకు సంబంధించిన చిన్నపాటి టేబుల్ ని కూడా ఈ శాఖ పోస్ట్ చేసింది.
ఎన్ 95 సహా మాస్కులు, చేతి శానిటైజర్లను అత్యవసర వస్తువులుగా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. వీటి కొరతను, బ్లాక్ మార్కెటింగ్ ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వర్గాలు ఈ ప్రకటన చేశాయి.
Everyone need not wear a mask. Know, when and how to wear a mask!#COVID19 #IndiaFightsCorona #CoronaOutbreak #HealthForAll #SwasthaBharat pic.twitter.com/FPqTHOZBdH
— Ministry of Health (@MoHFW_INDIA) March 17, 2020