కేరళ.. రోబోలతో కరోనా ‘నివారణ’.. వావ్ !

కరోనా నివారణకు కేరళ ప్రభుత్వం సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు రోబోలను ప్రవేశపెట్టింది.

కేరళ.. రోబోలతో కరోనా 'నివారణ'.. వావ్ !
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 18, 2020 | 5:32 PM

కరోనా నివారణకు కేరళ ప్రభుత్వం సరికొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రెండు రోబోలను ప్రవేశపెట్టింది. కేరళ స్ఠార్టప్  మిషన్ అనే ప్రభుత్వ ఏజన్సీ ద్వారా ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్టు.. ఈ రోబోలను డెవలప్ చేసిన అసిమోవ్ రోబోటిక్ సీఈఓ ఫౌండర్ కూడా అయిన జయకృష్ణన్ తెలిపారు. వీటిలో ఒక రోబో.. విజిటర్లకు మాస్కులు, న్యాప్ కిన్లు, శానిటైజర్లను ఇస్తుండగా.. మరొకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను వివరిస్తోంది. ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ రోబోల ‘సేవ’ విజిటర్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. కేరళలో కరోనా కేసుల సంఖ్య 23  కి పెరిగిన సంగతి విదితమే.