ఎటూ తేలని మధ్యప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్.. రేపు మళ్ళీ సుప్రీం విచారణ

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరో రోజుకూడా కొనసాగనుంది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తో బాటు మరో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే కూడా చేసిన వాదనలు, ప్రతివాదనలతో సుప్రీంకోర్టులో బుధవారం విచారణ 'హీటెక్కింది'

ఎటూ తేలని మధ్యప్రదేశ్ పొలిటికల్ క్రైసిస్.. రేపు మళ్ళీ  సుప్రీం విచారణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 18, 2020 | 6:04 PM

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరో రోజుకూడా కొనసాగనుంది. బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి తో బాటు మరో సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే కూడా చేసిన వాదనలు, ప్రతివాదనలతో సుప్రీంకోర్టులో బుధవారం విచారణ ‘హీటెక్కింది’. 22 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఓ వైపు మధ్యప్రదేశ్ లో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడగా.. మరోవైపు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరిగేలా చూడాలంటూ బీజేపీ  పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజంతా సుదీర్ఘ విచారణ జరిగింది. 19 మంది ఎమ్మెల్యేలు రాసినట్టు చెబుతున్న రాజీనామా లేఖలను ఒక్కరే రాశారని, ఇతర ఎమ్మెల్యేలు దానిపై సంతకాలు చేశారని, పైగా ఆరుగురు సభ్యుల తరఫున మరో ఇద్దరు రాజీనామా లేఖలను రూపొందించారని కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు. స్పీకర్ ను కాదని  అసలు అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ అనుచిత జోక్యం చేసుకున్నారని ఆయన అన్నారు. అటు-ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేయడం, న్యాయబధ్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడంకాదా అని మరో న్యాయవాది దుశ్యంత్ దవే దుయ్యబట్టారు. కాగా.. బీజేపీ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహ్తగీ.. రాష్ట్రంలో అధికారంలో కొనసాగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తాము ఎమ్మెల్యేలనెవరినీ కిడ్నాప్ చేయలేదని, వారే స్వచ్ఛందంగా భోపాల్ నుంచి బెంగుళూరు చేరుకున్నారని ఆయన అన్నారు. అటు-జస్టిస్ వై.వి.చంద్రచూడ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్ ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!