క‌ర‌చాల‌నంకు చెక్ పెట్టి.. నమస్కారం పెట్టండి.. చినజీయర్‌స్వామి సూచన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ఎనిమిది వేల మందిని బలిగొంది. అంతేకాదు దీని బారినపడి రెండు లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇది మనదేశంలో కూడా వ్యాప్తిచెందుతోంది. కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 150 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్‌ను ఎదుర్కొవచ్చని.. విదేశాల నుంచి వచ్చినవారినుంచే ఈ వైరస్ మనదేశంలో అడుగుపెట్టిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి […]

క‌ర‌చాల‌నంకు చెక్ పెట్టి.. నమస్కారం పెట్టండి.. చినజీయర్‌స్వామి సూచన
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2020 | 7:35 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ గురించి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ఎనిమిది వేల మందిని బలిగొంది. అంతేకాదు దీని బారినపడి రెండు లక్షల మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఇది మనదేశంలో కూడా వ్యాప్తిచెందుతోంది. కరోనా ప్రభావంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 150 మందికి పాజిటివ్‌గా తేలింది. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే.. ఈ వైరస్‌ను ఎదుర్కొవచ్చని.. విదేశాల నుంచి వచ్చినవారినుంచే ఈ వైరస్ మనదేశంలో అడుగుపెట్టిందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. కర చలనాలు మానేసి.. చక్కగా నమస్కారం పెట్టడానికి అలవాటు పడాలని.. అలాగే బయట ఉన్న సమయంలో వ్యక్తికి వ్యక్తికి మద్య కాస్త దూరంగా ఉండటం ఉత్తమమని తెలిపారు. ఈ వైరస్ బారిన పడిన వారు ఎవరో తెలియదు కాబట్టి.. ఇలా దూరంగా ఉండటం ద్వారా వైరస్‌కు చెక్ పెట్టొచ్చన్నారు. అంతేకాదు.. ఎప్పటికప్పుడు వేడివేడి పదార్ధాలు తినడం మంచిదని.. ఎక్కడ పడితే అక్కడ.. ఏది పడితే అది తినే ప్రయత్నాలు విరమించుకోవాలని సూచించారు. సరైన స్థానంలో సరైందని అనిపించినప్పుడు మాత్రమే బయట తినండం బెటర్ అన్నారు. ఇక ధ్యానం.. యోగాలతో కొన్ని వ్యాధులను జయించవచ్చని.. కొన్ని వ్యాధులను దరిదాపుల్లో రాకుండా చేసుకోవచ్చని.. చినజీయర్ స్వామి తెలిపారు.