“కరోనానా.. వీ డోంట్ కేర్” అంటూ.. సీఏఏకు వ్యతిరేకంగా..
ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనాకు బయపడుతుంటే.. సీఏఏ నిరసనకారులు మాత్రం తమకేమీ పట్టడంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుంపులుగుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా కూడా.. సీఏఏ నిరసనకారులు పట్టించుకోవడం లేదు. చెన్నై వీధుల్లో ఏకంగా ఐదువేల మంది ఒకేసారి గుంపులు గుంపులు గుమికూడారు. సీఏఏని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. తక్షణమే సీఏఏను ఉపసంహరించుకోవాలని మెరీనా బీచ్ సమీపంలోని చెపాక్ ప్రాంతంలో ఈ ఆందోళనలు చేపట్టారు. వీరంతా తౌహీత్ జమాత్ సంస్థకు చెందినవారిగా గుర్తించారు. […]
ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనాకు బయపడుతుంటే.. సీఏఏ నిరసనకారులు మాత్రం తమకేమీ పట్టడంలేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుంపులుగుంపులుగా ఉండొద్దని ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నా కూడా.. సీఏఏ నిరసనకారులు పట్టించుకోవడం లేదు. చెన్నై వీధుల్లో ఏకంగా ఐదువేల మంది ఒకేసారి గుంపులు గుంపులు గుమికూడారు. సీఏఏని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. తక్షణమే సీఏఏను ఉపసంహరించుకోవాలని మెరీనా బీచ్ సమీపంలోని చెపాక్ ప్రాంతంలో ఈ ఆందోళనలు చేపట్టారు. వీరంతా తౌహీత్ జమాత్ సంస్థకు చెందినవారిగా గుర్తించారు. ఒక్క చెన్నై ప్రాంతంలోనే కాకుండా.. ఇతర జిల్లాల్లో కూడా వీరు నిరసనలకు దిగుతున్నారు. అయితే వీరు చేపట్టే నిరసనలపై స్థానికంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దేశంలో కరోనా ప్రభావం ఉన్నప్పుడు.. ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలని.. ఇలా ఆందోళనలు చేపట్టడం సరైంది కాదని మండిపడుతున్నారు.