అక్కడి మందుబాబులకు భారీ షాక్.. బార్లన్నీ మూసివేత..!

కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా చూపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. గత ఫిబ్రవరి నెలలో మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరి పలు కఠని చర్యలు చేపడుతోంది. ఇక గురువారం నుంచి అక్కడ అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలంటూ సీఎం వి.నారాయణ స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుణ్య క్షేత్రాలతో పాటు.. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను బుధవారం […]

అక్కడి మందుబాబులకు భారీ షాక్.. బార్లన్నీ మూసివేత..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2020 | 8:31 PM

కరోనా ప్రభావం దేశ వ్యాప్తంగా చూపిస్తోంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి.. గత ఫిబ్రవరి నెలలో మనదేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను అరికట్టేందుకు అనేక ప్రయత్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పుదుచ్చేరి పలు కఠని చర్యలు చేపడుతోంది. ఇక గురువారం నుంచి అక్కడ అన్ని లిక్కర్ బార్లను మూసివేయాలంటూ సీఎం వి.నారాయణ స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుణ్య క్షేత్రాలతో పాటు.. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను బుధవారం నుంచే మూసివేసినట్లు సీఎం తెలిపారు. కరైకల్‌లోని తిరునల్లార్ శనీశ్వరన్ ఆలయంలో పవిత్ర స్నానాలను ఆచరించడంపై.. ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది.

కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి దాదాపు ఎనిమిది వేల మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. రెండు లక్షల మంది వరకు బాధితులున్నారు. ఇక మనదేశంలో వైరస్ బారినపడ్డ బాధితుల సంఖ్య 152కు చేరింది. అంతేకాకుండా.. ముగ్గురు ప్రాణాలు కూడా కోల్పోయారు.