AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టాబ్లెట్ కోసం మెడికల్ షాప్‌లోకి వచ్చాడు.. అక్కడున్న వ్యక్తి తీసి ఇద్దామనుకునేలోపే..

ఆ వ్యక్తి టాబ్లెట్ తీసుకునేందుకు మెడికల్ షాప్ లోకి వచ్చాడు. అక్కడున్న వ్యక్తి టాబ్లెట్ ఇచ్చేలోపు జరగరానిది జరిగింది. అతడు అక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

Telangana: టాబ్లెట్ కోసం మెడికల్ షాప్‌లోకి వచ్చాడు.. అక్కడున్న వ్యక్తి తీసి ఇద్దామనుకునేలోపే..
Telangana
N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 18, 2026 | 12:58 PM

Share

మూడు నెలల క్రితమే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఒక్కడే కుమారుడు. ఇంతలోనే ఆ తల్లిదండ్రులకు షాక్‌కు గురిచేసే వార్త. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కారేపల్లి మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డుకు చెందిన గణపతి నారాయణ లక్ష్మీ ప్రసన్న ఏకైక కుమారుడు సాయి చంద్ర( 24) సంవత్సరాలు బీ ఫార్మసీ పూర్తి చేసి తర్వాత హైదరాబాదులో హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.

ఎడమ చేయి లాగడంతో పక్కనే ఉన్న ఓ మెడికల్ షాప్‌కు వెళ్లి టాబ్లెట్లు అడిగాడు. ఇంతలోనే సాయి చంద్ర ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. దీంతో షాప్ సిబ్బంది సీపీఆర్ చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇదంతా సీసీ కెమెరాలో విజువల్స్ రికార్డు అయ్యాయి. కాగా ఆయన ఫోన్లో నెంబర్లు ఆధారంగా కుటుంబానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని తెల్లవారుజామున కారేపల్లికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి నారాయణ ఏన్కూరు మండలం వైరా నియోజకవర్గంలోని గార్ల వడ్డు లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఒక్క కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకుని.. చేతికి వచ్చాడని సంతోషించే లోపే కొడుకు మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. కారేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.