AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: ఒక్కరోజే 16 కేసులు నమోదు.. భారత్‌లో వేగంగా పెరిగుతున్న ఒమిక్రాన్‌..

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. గత ఏడాదికిపై విజృంభించిన కరోనా ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వణుకు పుట్టిస్తోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

Omicron Variant: ఒక్కరోజే 16 కేసులు నమోదు.. భారత్‌లో వేగంగా పెరిగుతున్న ఒమిక్రాన్‌..
Omicron Variant
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2021 | 8:27 PM

Share

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను మళ్లీ వణికిస్తోంది. గత ఏడాదికిపై విజృంభించిన కరోనా ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న తరుణంలో ఈ కొత్త వేరియంట్‌ వణుకు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌.. ఇప్పుడు ప్రపంచ ఆదేశాలన్నింటికి పాకుతోంది. ఈ వేరియంట్‌ కేసులు భారత్‌ క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే ఎనిమిది కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం ఢిల్లీలో నాలుగు, రాజస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

90 నిమిషాల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఫలితాలు..

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనకు గురి చేస్తోంది. దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఢిల్లీలోని ఐఐటీ పరిశోధకుల బృందం 90 నిమిషాల్లోనే ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే కొత్త వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్ష విధానాన్ని రూపొందించారు ఆర్‌టీపీసీఆర్‌ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కరోనా పరీక్షతో కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్‌ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు కనీసం మూడు రోజులు పడుతుంది.

తాజాగా ఢిల్లీ ఐఐటీకి చెందిన కుసుమా స్కూట్‌ ఆఫ్‌ బయాలాజికల్‌ సైన్సెస్‌ రాపిడి స్క్రీనింగ్‌ పరీక్షను డెవలప్‌ చేశారు. అయితే ఒమిక్రాన్‌లో వేరియంట్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు పరిశోధకులు. కొత్తగా రూపొందించిన విధానం ద్వారా ఒమిక్రాన్‌ను త్వరగా గుర్తించవచ్చని చెబుతున్నారు.గతంలో కరోనాను త్వరగా గుర్తించేందుకు పీసీఆర్‌ ఆధారిత పరీక్షను ఐఐటీ రూపొందించింది. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే పరీక్షకు అనుమతులు లభిస్తే తొందరగా ఫలితాలు రాబట్టేందుకు అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Student Innovation: చప్పట్లతోనే ఆన్.. ఆఫ్.. విద్యుత్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు విద్యార్థి సరికొత్త ఆవిష్కరణ

భగవద్గీతను ఆచరించి.. భావి తరాలకు అందించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్‌ స్వామిజీ పిలుపు

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..