నీళ్లు ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారా? ఎలాగంటే!

ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఖచ్చితంగా బరువు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే చాలా మంది బరువు తగ్గటానికి పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే సులువుగా నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా..

నీళ్లు ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారా? ఎలాగంటే!

ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో ఖచ్చితంగా బరువు పెరిగే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే చాలా మంది బరువు తగ్గటానికి పలు రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే సులువుగా నీళ్లు ఎక్కువగా తాగడం ద్వారా కూడా బరువు తగ్గొచ్చు. దీంతో కేలరీలు మాత్రమే కాదు, కొవ్వు, చక్కెర వంటివి శాతం కూడా తగ్గుతున్నట్టు హార్వర్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సర్వే చేశారు.

సాధారణంగా మనం రోజుకు 1 నుంచి 2 లీటర్ల నీళ్లు తాగుతామని వారు అంచనా వేశారు. ఇది రోజు మొత్తం మీద తాగే ద్రవాలలో 30 శాతం మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కాఫీ, టీ, పండ్ల రసాలు, ఆహారం వంటి రూపంలో నీరు లభిస్తుంది. దీనికి రోజూ అదనంగా పావులీటర్ నుంచి ముప్పావు లీటర్ నీరు తాగినవారు 68-205 కేలరీలు తక్కువగా తీసుకుంటుడటం గమనార్హం. అలాగే సోడియం 78-235 మిల్లీ గ్రాములు, చక్కెర 5-17 గ్రాములు, కొలెస్ట్రాల్ 7-21 మిల్లీగ్రాములు తీసుకున్నట్లు అధ్యయనంలో తేలింది. దీనికి కారణమేంటంటే.. అదనంగా తీసుకునే నీటితో కడుపు నిండిన భావన కలుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇది లాక్‌డౌన్ టైంలో చక్కగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు.

అలాగే తినేటప్పుడు నీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే తినటం తగ్గటమే కాకుండా కేలరీలు అధికంగా ఉండే తీపి పానియాలు తాగటమూ తగ్గుతుందట. కేలరీలు, చక్కెర, కొవ్వులు తీసుకోవడం తగ్గితే.. బరువూ అదుపులో ఉంటుంది. అంతేకాకుండా ఉదయం నిద్ర లేవగానే మూత్ర విసర్జన అనంతరం  ఒక గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గటంతో పాటు ఇతరత్రా సమస్యలనూ నివారించుకునే వీలు ఉంటుందని హార్వర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More: 

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!

హైపర్‌ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయిది ఏ జిల్లా అంటే!

సీఎం కేసీఆర్‌కు ఆర్జీవీ దిమ్మతిరిగే ఛాలెంజ్..

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu