గో మూత్రం తాగితే కరోనా రాదట..బెంగాల్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు
కరోనాను నివారించే శక్తి కేవలం గోమూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ గతంలో 'అఖిల హిందూ మహాసభ" ఆధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన విషయం విధితమే. అయితే, తాజాగా బీజేపీ నేత ఒకరు..

కరోనాను నివారించే శక్తి కేవలం గోమూత్రం, పేడకు మాత్రమే ఉందంటూ గతంలో ‘అఖిల హిందూ మహాసభ” ఆధ్వర్యంలో గోమూత్ర పార్టీని ఏర్పాటు చేసిన విషయం విధితమే. అయితే, తాజాగా బీజేపీ నేత ఒకరు ఆవు మూత్రం తాగితే కరోనా వైరస్ రాకుండా నిరోధించే శక్తి కలుగుతుందని వ్యాఖ్యానించారు. కరోనా నివారణ కోసం చేస్తున్న పోరాటంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి గోమూత్రం తాగాలని పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సూచించారు. కోల్‌కతా దుర్గాపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో దీలీప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దిలీప్ ఘోష్ ఆవులపై గతంలోనూ వివాదాస్పద ప్రకటన చేశారు. 2019 నవంబరులో దీలిప్ ఘోష్ ఆవు పాలలో బంగారం ఉందని వ్యాఖ్యానించడం విమర్శలకు దారి తీసింది. కాగా, ఈ ఏడాది కరోనా వ్యాప్తి నేపథ్యంలో మే ప్రారంభంలో దీలిప్.. ఆవు మూత్రాన్ని తాగడంలో ఎటువంటి హాని లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో బెంగాల్‌లోని తన సొంత పార్టీ నాయకులే దిలీప్ ఘోష్‌పై విమర్శలు చేశారు. కాగా, ప్రస్తుతం దీలీప్ ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
